వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోచార పరిచయం: పుట్టుకను బట్టి జాతకం

By Pratap
|
Google Oneindia TeluguNews

జ్యోతిషం అనగా కాంతిని ఆధారంగా చేసుకొని కాలాన్ని అధ్యయనం చేసే సిద్ధాంత శాస్త్రం. దీంట్లో చాలా విధాల అధ్యయనాలున్నాయి .

హోరా (గ్రహస్థితుల ప్రాధాన్యం కలవి), సాముద్రిక (చేయి మొదలైనవాటి రేఖలు ఈందులో ముఖ్యమైనవి), ఆరూఢ ( గవ్వలతో ప్రశ్నకు సమాధానం తీయటం), ప్రశ్న (ఇందులో శకునాలు మొదలైనవి ప్రధానం) మొదలైనవి.

గోచారం అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తి యొక్క రాశిఫలం. జాతకచక్రంలో వ్యక్తి పుట్టిన ప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ మరియు ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశిగానూ చెపుతారు.

Gochara: How to calculate man's future based on his birth

ఉదాహరణకు.-సెప్టెంబర్‌ 25, 2014. రోజున సూర్యోదయానికి సుమారు (6గంకి) పుట్టినవ్యక్తి ఐతే. ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆవ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నం అవుతుంది.

ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినపుడు మాత్రమే అర్థమౌతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాపపుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారం. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంకానీ యోగమున్నా గోచారంలో అనుకూలదశ లేకపోతే అవి వికటించవచ్చు అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం అదే ఎలాఉండాలో తెలిపే ఒక మంచి సలహా జ్యోతిషం . అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని దిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.

కొన్ని ఉదాహరణలు ఆదాయవ్యయాలు చూసినప్పుడు. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగాఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటినిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది.

ఇకముందు రాబోయే ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటంద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకుంటారని ఆశిస్తాం.

English summary
Maruthi Sharma explains about Gochara, it describes the future of a man based on his birth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X