సినీమా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపుకావాలని హైదరాబాదుకు వచ్చిన సునీల్ కమేడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి అనతికాలంలోనే తన వైవిధ్యమైన నటనతో స్టార్ కమేడియన్ గా ఎదిగాడు. ఆ మధ్య 'అందాల రాముడు' చిత్రంతో హీరోగా కూడా విజయాన్ని పొందిన సునీల్, తర్వాత కమేడియన్ గా కొనసాగడానికే ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో హీరోగా 'మర్యాద రామన్న' చిత్రంలో నటిస్తున్నారు.
తాజాగా అందిన విశ్వసనీయ కథనం ప్రకారం సునీల్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. సునీలే కథానాయకుడిగా నటించబోతున్నట్టు బోగట్టా..కథానాయిక, ఇతర వివరాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం వుంది.