Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
అనుష్క కూడా సేవ్ చేయలేకపోయింది(ట్రేడ్ టాక్)
ఎప్పటిలాగే ఈవారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ రెండు తెలుగు సినిమాలతోపాటు ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా థియేటర్లలోకి దిగింది.మొదటగా తెలుగు స్టైయిట్ చిత్రం చూస్తే...జగపతి బాబు, విమలా రామన్ జంటగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన 'చట్టం". ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినా జనాలు మాత్రం ధియోటర్స్ వైపు వెళ్ళటంలేదు. పేపర్లో డైలీ కనిపించే సమకాలీన సమస్యలను వరసగా కూర్చుకుంటూ పోవటమే ఈ చిత్రానికి మైనస్ గా మహా నసగా మారిందంటున్నారు.ఇక ఆ మధ్యన ఎల్ బి శ్రీరాం నటించిన'సొంతవూరు"చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు నంది అవార్డులు అందుకున్న దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం 'గంగపుత్రులు"కూడా ఈ వారమే విడుదలైంది. మత్స్యకారుల జీవితాలను తెరకెక్కించిన తీరు బాగానే వుందనిపించినా సినిమా ఏ వర్గానికీ ఎక్కటం లేదు.అవార్డుల కోసమే తీసినట్లున్న ఈ చిత్రం వారినైనా మెప్పిస్తుందేమో చూడాలి. ఇక విజయ్, అనుష్క జంటగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'పులివేట"విడుదలైంది. అనుష్క కి తెలుగులో ఉన్న మార్కెట్ ను క్యాష్ చేసుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం బోల్తా కొట్టింది.తమిళంలోనే డిజాస్టర్ గా మారిన ఈ చిత్రం ఇక్కడా అదే పరిస్ధితిని ఎదుర్కుంది.