మరో హీరోయిన్ నిశ్చితార్దం ముగిసింది

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 9:46 [IST]
సినీ జనానికి పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లుంది. మొన్న జెనీలియా వివాహం అయ్యిన కొద్ది రోజులకే మరో హీరోయిన్ పెళ్లి పీటల మీదకు ఎక్కటానకి రెడీ అయ్యింది. హేమామాలిని,ధర్మేంద్రల పెద్ద కూతురు ఇషా డియోల్‌ నిశ్చితార్థం వ్యాపారవేత్త భరత్‌తో ఆదివారం జూహూ బంగ్లాలో జరిగింది. ఈ ఫంక్షన్ కి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆహ్వానం లభించింది. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో సినిమా జనం కూడా చాలా తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. కేవలం బాలీవుడ్‌ నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో జయా బచ్చన్‌ ఒక్కరే ఉన్నారు.

డ్రీమ్ గర్ల్ హేమామాలిని నిశ్చితార్థం గురించి చెబుతూ ''ఈ రోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇషా, భరత్‌ల నిశ్చితార్థం పూర్తిగా మా వ్యక్తిగత వ్యవహారం..అందుకే ఎవరినీ ముఖ్యంగా మీడియాని పిలవలేదు'' అన్నారు. కాబోయే పెళ్లికూతురు ఇషా చెబుతూ ''నాకు, భరత్‌కు ఆశీస్సులు అందించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఎంతో ఆనందంగా ఉందని అంది. ఇక ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారని అడిగితే.. ''త్వరలోనే ఉంటుంది. ఇంకా నిర్ణయించలేదు. ఫలానా తేదీ అనుకోగానే వెల్లడిస్తామని చెప్పారు.
English summary
Hema Malini and Dharmendra's elder daughter actress Esha Deol got engaged to her businessman beau Bharat Takhtani at a private ceremony took place on Sunday at Hema's Juhu bungalow.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST