twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ డే కలెక్షన్స్ లో పెద్ద రికార్డు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సల్మాన్‌ ఖాన్‌ హీరా గా నటించిన తాజా చిత్రం 'ఏక్‌ థా టైగర్‌'. కత్రినా కైఫ్‌ హీరోయిన్ గా నటించింది. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా బుధవారం విడుదలైంది. మొదటి రోజే రూ.32.92 కోట్లు సాధించినట్లు బాలీవుడ్‌ సమాచారం. హృతిక్‌రోషన్‌ నటించిన 'అగ్నిపథ్‌' తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. దాని వసూళ్లు రూ.21.5 కోట్లు. ఇప్పుడు 'ఏక్‌ థా...' ఆ మొత్తాన్ని అధిగమించింది. దాంతో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డుగా చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే...ఇదో రొమాంటిక్ ధ్రిల్లర్. ఇందులో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపిస్తారు. కథ ప్రకారం ట్రినిటి కాలేజ్ సైంటిస్ట్ ..మిస్సైల్స్ టెక్నాలిజీని పాకిస్ధాన్ కి అమ్ముతున్నారని అనుమానం వస్తుంది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ తమ సీక్రెట్ ఏజెంట్ టైగర్(సల్మాన్ ఖాన్)ని ప్రొఫెసర్ ఏక్టివిటీస్ కనుక్కోమని పంపుతుంది. ఈలోగా టైగర్ ..ఆ ప్రొఫెసర్ కేర్ టేకర్ జోయా(కత్రినా కైఫ్)తో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి వారి జర్ని డబ్లిన్ నుంచి ఇంస్లాంబుల్ వరకూ సాగుతుంది. ఈ లోగా ఆమె ఐఎస్ ఐ ఏజెంట్ అని తెలుస్తుంది. అక్కడ నుంచి సినిమా పూర్తి ఫన్ రైడర్ గా ఉండనుంది.'

    ఇక 'ఏక్ థా టైగర్'కు సంబంధించిన ప్రోమోలు పై పాకిస్ధాన్ బ్యాన్ పెట్టింది. తమ దేశంలో ఆ చిత్రానికి సంభందించి ప్రోమోలు, రివ్యూలు ప్రదర్శించకూడదని తమ దేశంలోని కేబుల్ ఆపరేటర్లను పాకిస్థాన్ ఆదేశించింది. పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) ప్రతిష్టను ఈ సినిమా దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్... 'రా' ఏజెంట్ పాత్రను పోషించారు. కత్రినాకైఫ్ హీరోయిన్‌గా నటించారు.

    ఈ మేరకు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ), మీడియా రెగ్యులేటరీ వాచ్‌డాగ్ ఆ దేశంలోని అన్ని టీవీ చానళ్లకు, కేబుల్ నెట్‌వర్క్‌లకు లేఖ రాశాయి. ' ఐఎస్‌ఐ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) కార్యకలాపాల ఆధారంగా 'ఏక్ థా టైగర్' ను తెరకెక్కించారు. ఐఎస్‌ఐ ప్రతిష్టకు మచ్చ తెచ్చే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు' అని లేఖలో పేర్కొన్నాయి. కబీర్‌ఖాన్ దర్శకుడు. కబీర్ ఖాన్ గతంలో కాబూల్ ఎక్సప్రెస్ (2006),న్యూయార్క్ (2009) చిత్రాలను డైరక్ట్ చేసారు.

    English summary
    'Ek Tha Tiger' has opened to packed houses. He tweets, "Okay, here's the *actuals* of #EkThaTiger on Wednesday: Rs 32.92 cr nett on 3300 screens in India. Beyond Historic!" . The film received mixed reviews on its release but the enthusiasm of Salman Khan's fans made it a successful film on the very first day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X