Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

నిజమైన 'సుడిగాడు' దాసరి

Posted by:
Published: Friday, September 7, 2012, 15:13 [IST]

నిజమైన 'సుడిగాడు' దాసరి
 

హైదరాబాద్: దర్శక,నిర్మాత దాసరి ఆ మధ్యన ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా డిజాస్టర్ అయ్యేంది. అలాగే దర్శకుడుగానూ దాసరి నారాయణరావు హిట్ ఇచ్చి దశాబ్దం దాటింది. అలాంటి ఆయన వరసగా రీసెంట్ గా ఇటీవల రెండు హిట్‌లు కొట్టి పరిశ్రమను నివ్వెరపరిచారు. అలాగని అవి ఆయన తీసిన సినిమాలు కావు. కొనుక్కుని డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు. ఆ జులాయి హక్కులు రాష్ట్ర వ్యాప్తంగానూ, సుడిగాడు హక్కులు నైజాం ఏరియాకు కొని ఆయన డబ్బులు చేసుకున్నారు.

ఇక అల్లు అర్జున్ హీరోగా చేసిన జులాయి సినిమాకు ముందు డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఊహించని విధంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈచిత్రానికి సంబంధించిన ఏపీ థియేట్రికల్ రైట్స్ దాసరికి సంబంధించిన ‘సిరి మీడియా' భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అంతేగాక ‘ఈరోజుల్లో' శతదినోత్సవం వేడుకల్లో...అల్లు అర్జున్ నటించిన 'జులాయి'లాంటి పెద్ద సినిమాకే కర్నూలులో థియేటర్‌ ఇవ్వడం లేదు. అందుకే ప్రేక్షకులే తిరగబడేలా ఉద్యమం తీసుకొస్తాము''అని ఆవేశంగా అన్నారు దాసరి నారాయణ రావు. అలా మొత్తానికి ఆయన హిట్ కొట్టి డబ్బు చేసుకున్నారు.

మరోపక్క సుడిగాడు నైజాం హక్కులను నరేష్ రేంజ్ ధరకే తీసుకుని, మంచి కలెక్షన్లు అందుకున్నారు దాసరి. చిత్రం కలెక్షన్స్ గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ..."ఈ సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి కానీ ఈ స్థాయి కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ 'సుడిగాడు' పెద్ద హిట్టయింది. తొలివారంలో రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్ టాక్ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్ 'తమిళ్ పడమ్' కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డైరెక్టర్ అముదన్‌కు అది తొలి చిత్రం. 'సుడిగాడు' రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్ హక్కులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.

ఏదైమైనా దాసరి సుడి బాగా తిరుగుతోంది అంటున్నారు పరిశ్రమలో వాళ్లు. ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం బావుంది కాబట్టి ఆయన వరసగా సినిమాలు కొనే అవకాసం ఉంది అంటున్నారు. అయితే బొగ్గు కుంభ కోణం కేసులో ఆయనపై సిబిఐ దర్యాప్తు జరిగే అవకాసం ఉంది అని వినిపిస్తోంది. ఈ నేఫధ్యంలో ఈ సుడి అటు కూడా కలిసి వస్తే ఆయన తేలిగ్గా దాని నుంచి బయిటకు వస్తారు.

English summary
veteran director Dasari Narayana Rao get money with his dustribution net work. He has bought the theatrical distribution rights of Julaayi for entire Andhra Pradesh through his Siri Media and Nizam rights for Sudigaadu.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice