twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రొటీన్ లవ్ స్టోరీ’శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

    By Srikanya
    |

    హైదరాబాద్ : సందీప్‌కిషన్, రెజీనా జంటగా ఎ బెంచ్ మార్క్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం 'రొటీన్ లవ్ స్టోరీ'. 'ప్రస్థానం', 'స్నేహగీతం' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ హీరోగా చేసిన ఈ చిత్రాన్ని ఎల్ పి డబ్లూ తో పరిచయమైన ప్రవీణ్ సత్తార్ డైరక్ట్ చేసారు. ఈ చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను తాజాగా స్టూడియో ఎన్ వారు కొనుగోలు చేసారు. కోటి 75లక్షలకు ఈ శాటిలైట్ రైట్స్ వెళ్లినట్లు ట్రేడ్ సమాచారం.

    కలెక్షన్స్ పరంగా 'రొటీన్ లవ్ స్టోరీ'కి ఇక్కడ ఇండియాలో పెద్దగా కలెక్షన్స్ లేకపోయినా... ప్రస్తుతం అమెరికా బాక్సాఫీసు వద్ద మూడో స్థానంలో నిలిచింది. అక్కడ 13 స్క్రీన్లలో విడుదలైన రొటీన్ లవ్ స్టోరీ తొలి నాలుగు రోజుల్లో రూ. 4.61 లక్షలు($ 8,300) వసూలు చేసింది. గురువారం $ 1,704, శుక్రవారం $ 2,033, శనివారం $ 2,331, ఆదివారం $ 2232 వసూలు చేసింది.

    కథ ప్రకారం సంజూ (సందీప్‌ కిషన్‌) చాలా సరదాగా జీవితం ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయిర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను ఆ వయస్సులో అందరిలాగే తన క్లాస్ మేట్ తన్వి (రెజీనా) ప్రేమలో పడతాడు. మొదటి వీరిద్దరూ మంచి స్నేహితుల్లా కొంత కాలం సరదాగా గడుపుతారు. అ తర్వాత ఓ రోజు సంజూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె తనకు కొంత సమయం కావాలని,ఇద్దరం మరింతగా అర్దం చేసుకోవటానికి ఆ సమయం ఉపయోగిస్తుందని అంటుంది. ఇద్దరిలోనూ పాజిటివ్,నెగిటివ్ లు ఉంటాయి. దాంతో ఆరిలేషన్ షిప్ లో వీరిద్దరూ దగ్గరయ్యారా..లేక వేరు వేరు భావాలతో విడిపోయారా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, సురేఖావాణి, తాగుబోతు రమేష్, ప్రగతి, స్వప్నిక, కృష్ణుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ, పాటలు: కృష్ణ చిన్ని, అనంత శ్రీరామ్, వనమాలి, సంగీతం: మిక్కీజే మేయర్, నిర్మాత: చాణక్య బూనేటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్.

    English summary
    Sandeep Kishan and Regina Cassandra's romantic entertainer 'Routine Love Story' directed by ‘LBW’ fame Praveen Sattaru slowly catching the imagination of movie lovers. According to latest information the film's satellite rights have been bagged by Studio ‘N’ for Rs 1.75 crs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X