twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నైజాంలో ‘SVSC’ రికార్డ్, తప్పుడు లెక్కలంటూ వివాదం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు....సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న విడుదలైన ఈచిత్రం తొలి వారం నైజాం ఏరియాలో దాదాపు రూ. 10.08 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అదే నిజమైతే ఈ చిత్రం నైజాం ఏరియాలో తొలి వారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం ఖాయం.

    అయితే ఇవన్నీ తప్పుడు లెక్కలంటూ కొందరు వివాదానికి తెరలేపారు. రూ. 10.08 నెట్ కలెక్షన్ మాత్రమే అని, షేర్‌ అంత రాలేదని అంటున్నారు. ఏది ఏమైనా నిర్మాత దిల్ రాజు ఈ వివరాలు అధికారికంగా వెల్లడిస్తే తప్ప నిజానిజాలు బయట పడే అవకాశం లేదు.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు చాలా మంది క్రిటిక్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ కితాబిచ్చారు. దీనికి తోడు క్లాస్ పీపుల్ నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ వ్యాప్తి చెందడం సినిమాకు కలిసొచ్చింది. వచ్చే రోజుల్లో కూడా సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉంది. వీకెండ్, సంక్రాంతి హాలిడేస్ కలిపి ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చి పడ్డాయి.

    చాలా కాలం తర్వాత భారీ తారాగణంతో కూడిన...అశ్లీలత, అసభ్యత, హింస లాంటివి లేకుండా ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమా కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు సమంత, అంజలి, ప్రకాష్ రాజ్ ఉండటం సినిమాకు మరింత కలిసొచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు.

    English summary
    Telugu movie Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) starring Mahesh Babu and Venkatesh in leads, has taken Box Office by storm. Despite facing tough competition from Ram Charan's Naayak, the Srikanth Addala directed film has done superb collection at the business centres across the globe in the first week of its release. It has shattered several old records and registered its own new marks. film’s first week share stands at a phenomenal figure of approximately Rs. 10.08 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X