twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVSC, నాయక్....యూఎస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సంక్రాంతికి రిలీజైన్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' చిత్రాలు యూఎస్ బాక్సాఫీసు వద్ద రెండో వారం కూడా తమ సత్తా చాటాయి. అయితే మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మాత్రం మరోసారి టాప్ పొజిషన్లో నిలిచింది. గత వారం విడుదలైన బాలీవుడ్ సినిమాలు ముంబై మిర్రర్, మాత్రుకి బిజిలీకా మండోలా చిత్రాలు కూడా కలెక్షన్ల విషయంలో SVSC కంటే వెనక బడ్డాయి.

    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం' రెండో వారంలో 70 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $2,03,160 వసూలు చేసింది. రెండో వారం ఒక్కో స్ర్కీన్ కు యావరేజ్ గా $2,902 వసూలైంది. టోటల్ గా ఇప్పటి వరకు 11 రోజుల్లో ఈ చిత్రం రూ. 8.31 కోట్లు($15,48,709) వసూలు చేసింది. యూఎస్ బాక్సాఫీస్ ఇండియన్ సినిమాల చార్ట్‌లో నెం.1 స్థానంలో నిలిచింది. యూఎస్ బాక్సాఫీస్ తెలుగు సినిమా చరిత్రలో ఇంత పెద్ద మొత్తం వసూలవ్వడం సరికొత్త రికార్డ్.

    అయితే రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'నాయక్' చిత్రం మంచి వసూళ్లు సాధిస్తున్పప్పటికీ ఈ రేంజిలో లేదు. యూఎస్ బాక్సాఫీసు చార్ట్ లో ఈ చిత్రం 3వ స్థానంలో నిలిచింది. రెండో వారం ఈచిత్రం 38 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $62,542 వసూలు చేసింది. ఒక్కో స్క్రీన్ కు యావరేజ్ గా $1,646 వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 2.53 కోట్లు($4,71,300) వసూలు చేసింది.

    బాలీవుడ్ మూవీ 'మాత్రుకి బిజిలీకా మండోలా' చిత్రం కలెక్షన్ చార్ట్ లో 2వ స్థానంలో ఉంది. ఈ చిత్రం సెకండ్ వీకెండ్ లో 74 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $90,208 వసూలు చేసింది. యావరేజ్ గా ఒక్కో స్క్రీన్ కు $1,219 వసూలైంది. ఇది నాయక్ మూవీ స్క్రీన్ యావరేజ్ కంటే తక్కువ. ఇక ముంబై మిర్రర్ చిత్రం 4వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం తొలి వీకెండ్ పూర్తి చేసుకుని 28 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ టోటల్ గా రూ. 2.44 లక్షలు ($4,550) వసూలు చేసింది. స్క్రీన్ యావరేజ్ కేవలం $163 మాత్రమే.

    English summary
    Last week's Telugu releases Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) and Naayak have continued to rock at the USA Box Office in their second weekend. The Mahesh Babu and Venkatesh starrer movie has once again topped the collection chart at the international market, beating Bollywood movies like Matru Ki Bijlee Ka Mandola (MKBKM) and Mumbai Mirror.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X