twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిస్టర్ పెళ్లికొడుకు’ US కలెక్షన్స్ మరీ అంత ఘోరమా?

    By Srikanya
    |

    హైదరాబాద్ :సునీల్, ఇషాచావ్లా హీరో,హీరోయిన్స్ గా మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై రూపొందించిన 'మిస్టర్ పెళ్లికొడుకు' చిత్రం మార్చి 1న విడుదలైన సంగతి తెలిసిందే. దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పూల రంగడు చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సునీల్ ఈ సినిమాతో చతికలపడ్డారు. ఈ చిత్రం యుస్ లో 50 లో స్క్రీన్స్ లో విడుదల అయ్యింది. వీకెండ్ లో మరీ తక్కువగా అంటచే కేవలం 7 లక్షలు ($ 12,666) వసూలు చేసింది. ఓవర్ సీస్ మార్కెట్ లో ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ కలెక్టు చేసిన చిత్రం ఇదే అంటున్నారు.

    మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్‌గా తయారైన ఈ చిత్రం ఒరిజనల్ చిత్రం ప్లేవర్ సినిమాలో లేకపోవటం మైనస్ గా మారింది. పూల రంగడు చిత్రం తర్వాత వస్తున్న సునీల్ చిత్రం కావటంతో ట్రేడ్ లో సైతం మంచి బిజినెస్ జరిగింది. సునీల్ సైతం ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేసిందీ చిత్రం.

    ఎన్నారై సునీల్ ఈ దేశంలో అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని,ఇక్కడ అమ్మాయిలైతే సంప్రదాయబద్దంగా ఉంటారని నమ్మకం. అందుకోసం ఓ పెళ్లి చూపులు కు వచ్చి..తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ..ఆమె తన బోయ్ ప్రెండ్ ని పెళ్లి చేసుకుంటోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అదే విషయాన్ని తన తల్లి తండ్రులకు చెప్తాడు కానీ, కానీ అప్పటికే అతని మనస్సు పూర్తిగా ఆమెతో నిండిపోయి ఉంటుంది. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇలాంటి సిట్యువేషన్ లో ఎలా చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఏ ఇబ్బందులు పడ్డాడన్నదే మిగతా కథ.

    English summary
    Sunil scored big flop with Mr.Pellikoduku. Especially, the film bit the dust in its opening weekend itself in overseas market. The film got abysmally low amount of Rs 7 lakhs ($ 12,666) from 50 screens in the opening weekend in USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X