twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'బాద్‌షా' లాస్ అంతా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ మొదటి వారం బాగున్నా..తర్వాత మెల్లిగా తగ్గిపోవటం మొదలైందనేది అందరికీ తెలిసిందే. ఈ నేఫధ్యంలో చిత్రం లాస్ ఎంత వచ్చిందనేది అంచనాలు మొదలయ్యాయి.

    ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం లాస్ ఇరవై కోట్లు అని చెప్పుకుంటున్నారు. అయితే అది గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కొందరు కొట్టిపారేస్తున్నారు. తొలివారంలోనే చాలా వరకూ వెనక్కి వచ్చిందని అలాంటప్పుడు అంత లాస్ కి అవకాసమే లేదని చెప్తున్నారు.

    అయితే బండ్ల గణేష్ ..ఐదు కోట్ల టేబుల్ లాస్ కి అమ్ముకున్నాడని, సినిమా హిట్టైతే షేర్ పద్దతిని రికవరి అయ్యేదని, యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలివారాంతానికే కలెక్షన్స్ క్షీణించటం దెబ్బకొట్టిందని,డిస్ట్రిబ్యూటర్స్ ఈ లాస్ ని తప్పనిసరిగా భరించాల్సిన సిట్యువేషన్ ఏర్పడిందని చెప్తున్నారు.

    నిర్మాత బండ్ల గణేష్ ...తన ఇద్దరమ్మాయిలు చిత్రంతో డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ రికవరీ చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఈ లెక్కలు ఊహాత్మకమే అని ట్రేడ్ లో అంటున్నారు. ఖచ్చితంగా ఇంత పోయిందని అప్పుడే చెప్పలేమని, తెలిసినా అలాంటి విషయాలు నిర్మాతకు తప్ప ఖచ్చితంగా బయిటకు తెలియదని అంటున్నారు.

    వీకెండ్స్ లో తప్ప మిగతా రోజుల్లో చెప్పుకోతగ్గ కలెక్షన్స్ లేవని అంటున్నారు. ఊహించిన విధంగా కామెడీ క్లిక్ కాకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందులోనూ ఎన్టీఆర్ బాద్షా గెటప్ పేలలేదు. దాంతో సినిమా రేంజి తగ్గిపోయింది. పబ్లిసిటీ కూడా మొదటి ఓ రేంజిలో ఊపారు కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గించేసారు.

    దానికి తోడు నితిన్ తాజా చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే కూడా ఈ చిత్రానికి పోటీగా మారింది. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. దాని ఎఫెక్టు బాద్షా పై బాగా పడుతోంది.

    English summary
    According to film nagar talk, it is heard that ‘Baadshah’ has actually suffered a loss of Rs 20 crores. Buzz is that even Bandla Ganesh has sold it at a table loss of Rs 5 crores and the exhibitors and distributors faced the maximum damage. Also, Nithiin’s release ‘GJG’ added to the damage by getting a super hit response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X