Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ 'రభస' బిజినెస్ పొజీషన్
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో సాగుతోంది. ట్రేడ్ లో వినపడుతున్న వివరాల్లోకి వెళితే...
నైజాం రైట్స్ ని ఇప్పటికే దిల్ రాజు తీసేసుకున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని వినికిడి. గతంలో నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్ కి మధ్య ఉన్న పెండింగ్ పేమెంట్స్ ఇష్యూతో ఈ డీల్ క్లియర్ పిక్చర్ రాలేదని తెలుస్తోంది.
సీడెడ్ విషయానికి వస్తే... ఏరియా వైజ్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు కి ఏడు నుంచి ఏడున్నర కోట్ల మధ్య బిజినెస్ జరిగిందని వినికిడి. కర్ణాటక రైట్స్ ని వేణుగోపాల్ ... 3.75 ఎన్ ఆర్ ఎ కి తీసుకున్నారని, చెప్తున్నారు. కృష్ణా ఏరియాకి సురేష్ మూవిస్ వారు అడుగుతున్నారని, వారు సొంతం చేసుకోకపోతే అలంకార్ ప్రసాద్ తీసుకునే అవకాసం ఉంది. గుంటూరు, నెల్లూరు ఏరియాలకు హరి పిక్చర్స్ వారు డిస్కషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్ కలిగిస్తాయి'' అన్నారు.
దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.