twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ సపోర్టుతో రామ్ చరణ్ దున్నేస్తున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: మెగా హీరోలకు ఆంధ్రాలోనూ,ఓవర్ సీస్ లోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే బన్నీకి కేరళ లో కూడా మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అయ్యి విజయం సాధిస్తున్నాయి. బన్ని సినిమాలు అంటే అక్కడ ట్రేడ్ లో క్రేజ్ ఉంది. ఇక్కడి ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడాయి. అదే రామ్ చరణ్ కి ప్లస్ అయ్యింది. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మళయాళి వెర్షన్ కేరళ అంతటా భారీ ఎత్తువ జనవరి 31న విడుదల అయింది. బన్నీ ని పోస్టర్స్ వేయటంతో ఓపినింగ్స్ అదరకొట్టాయి. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ సైతం అక్కడ అలవాటు పడుతున్నారు. బన్నీనే కేరళలో రామ్ చరణ్ కి పాస్ పోర్ట్ అంటున్నారు.

    భయ్యా టైటిల్ తో ఈ చిత్రం దాదాపు 90 కి పైగా థియోటర్స్ లో విడుదల చేసారు. రిలీజ్ కు ముందే మంచి పబ్లిసిటీలో క్రేజ్ తేవటంతో మంచి ఓపినింగ్స్ సైతం వచ్చాయి. దాదాపు ఎనిమిది రోజుల్లో కోటిన్నర వరకూ కలెక్టు చేసిందని అక్కడ ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే అక్కడ రివ్యూలు కూడా మూడు,మూడున్నర స్టార్స్ తో కమర్షియల్ హిట్ గా చిత్రాన్ని థృవీకరించారు. అల్లు అర్జున్ అభిమానులతో థియోటర్స్ వీకెండ్ లో హౌస్ ఫుల్ అయ్యాయి.

    సంక్రాంతి కానుకగా విడుదలైన ఎవడు కలెక్షన్ల పరంగా దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. మళయాళ వెర్షన్ కు గానూ...భయ్యా అనే టైటిల్ పెట్టారు. మై బ్రదర్ అనేది ట్యాగ్లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్‌చరణ్‌తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

    దిల్‌రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.

    English summary
    'Yevadu's Malayalam version ' was released on 31st January in 90+ screens across the state. The Malayalam audience is familiar with Allu Arjun whose films have fared well in the Kerala. Even few of Bunny flop Telugu films were decent grossers there. This craze of Allu Arjun helped Bhaiyya collecting record grosses and it also helped cherry to expand his market in Kerala .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X