twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జపాన్‌లో శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ వసూళ్లు అదిరాయ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సుమారు పదిహేనేళ్ల తర్వాత శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ఇంటాబయటా కూడా మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రీదేవి తన అభినయానికి ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఇక్కడ విజయవంతమైన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ భాషలోకి అనువదించారు.

    జూన్ 28వ తేదీన మొత్తం 33 స్క్రీన్లలో జపాన్లో విడుదల చేసారు. నెల రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. దాదాపు $420,000 (రూ. 2.5 కోట్లు) వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. జపాన్లో 3 ఇడియట్స్ చిత్రం తర్వాత భారీ మొత్తంలో వసూలు చేసిన హిందీ సినిమా ఇదే కావడం విశేషం.

    'English Vinglish' mints $420,000 in Japan

    సినిమా విడుదలకు ముందే....జపాన్‌‌లో 'ఇంగ్లిష్ వింగ్లిష్' స్పెషల్ ప్రీమియర్ షో జరిగిన విషయం తెలిసిందే. ఈ షో జపాన్ ఫస్ట్ లేడీ, ఆ దేశ ప్రధాని భార్య అయిన అకీ ఆబె కూడా హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత అకీ ఆబె కళ్లు చెమర్చాయి. దీన్ని బట్టి 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాకు ఆమె ఎంతలా కనెక్ట్ అయ్యారో స్పష్టమవుతోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా ఎంతో బాగుందని ప్రశంసించారు. ఈ సంఘటన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం జపాన్‌లో హిట్ కావడానికి తోడ్పడింది.

    ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రానికి గౌరీ షిండే దర్శకత్వం వహించారు. సునీల్ లుల్లా, ఆర్. బాల్కి, రాకేష్ ఝంఝన్ వాలా ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్ రాని కారణంగా సాధారణ మధ్య తరగతి మహిళ ఇంట, బయట ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది....తనను తాను ఎలా సక్సెస్ ఫుల్ లేడీగా నిరూపించుకుంది అనేది ఈ చిత్రం కథాంశం.

    English summary
    
 Sridevi-starrer "English Vinglish" has amassed $420,000 at the Japanese box office, as it continues its dream run in international markets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X