twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో పాపం....‘రభస’ పరిస్థితి అలా ఉందేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుండి 'A' సర్టిఫికెట్ పొందిన రభసను ఆగస్టు 29న విడుదల చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.

    కేవలం ఆంధ్ర, తెలంగాణలలో మాత్రమే కాదు....అమెరికాలోనూ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఎన్టీఆర్ గత సినిమాలు 'బాద్ షా', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలతో పోలిస్తే అమెరికాలో 'రభస' చిత్రం విడుదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ రెండు సినిమాల కంటే తక్కువ స్క్రీన్లలోనే 'రభస' చిత్రం విడుదలవుతోంది.

    Jr NTR's Rabhasa Fails To Beat Baadshah, Ramayya Vasthavayya Records

    గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం అమెరికాలో 108 స్క్రీన్లలో విడుదల చేసారు. ఆ తర్వాత వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం 115కు పైగా స్క్రీన్లలో విడుదల విడుదల పరంగా 'బాద్ షా' రికార్డును బద్దలు కొట్టింది. అయితే రభస చిత్రం ఈ రెండు చిత్రాల కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతుందని ఊహించిన అభిమానులకు చుక్కెదురైంది. కేవలం 90 సెంటర్లలో మాత్రమే 'రభస' చిత్రం విడుదలవుతోంది.

    సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'రభస' చిత్రం యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన కొడుకు బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, జయసుధ, నాజర్, అలీ, షాయాజీ షిండే, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

    English summary
    Actor Junior NTR's much-awaited Telugu movie Rabhasa is all set to rock the viewers during this Ganesh Chathurthi festival. Having got 'A' certificate from the Censor Board, the movie is slated to hit the screens on August 29. The makers have planned to release it in a large number of screens in America. But this number is much lower than that of NTR's previous releases Baadshah and Ramayya Vasthavayya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X