twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శాటిలైట్ అమ్మేసారు..అందుకే ఆ ఉషారు

    By Srikanya
    |

    హైదరాబాద్: చిన్న సినిమాకు శాటిలైట్ అమ్మకం అనేది చాలా పెద్ద ఎలిమెంట్ గా మారింది. రిలీజ్ కు ముందే చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ పై ఏ ఛానెలూ ఆసక్తి చూపటం లేదు. అయితే రీసెంట్ గా 'కార్తికేయ' చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడయిందని సమాచారం. జెమినీ టీవీ వారు కోటిన్నర కు ఈ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.రిలీజ్ కు ముందే శాటిలైట్ అమ్ముడవటంతో పెట్టుబడిలో కొంత రికవరీ అయినట్లే...చిన్న సినిమాలకు అది వరం లాంటిది. దాంతో ఈ చిత్రం దర్శక,నిర్మాతలు చాలా ఉషారుగా ఉన్నారు. ఆగస్టు 1 న చిత్రం విడుదలకు ప్లాన్ చేసారు.

    'నిఖిల్, స్వాతి' కాంబినేషన్ లో 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ రూపొందిస్తున్న చిత్రం 'కార్తికేయ'. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

    Karthikeya's satellite rights sold to Gemini TV

    నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

    ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

    English summary
    Karthikeya's satellite rights have been reportedly bought by Gemini TV for a price of nearly Rs 1.5 crores. The film is slated for release in theatres on August 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X