twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికవరీ కష్టమే అంటున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సరైన ప్లాట్ లేకపోతే ఎన్ని మసాలాలు అద్దిగా వృధా అని మరోసారి డబ్బింగ్ సినిమా సాక్షిగా ప్రూవ్ అయ్యింది. ట్రైలర్స్, పోస్టర్స్ చూసి అంచనాకు వచ్చి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదనే పాఠం కూడా సికిందర్ చిత్రం నేర్పింది. ట్రేడ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి సికిందర్ చిత్రం నిర్మాత లగడపాటి శ్రీధర్...ఈ సికిందర్ చిత్రం డబ్బింగ్ రైట్స్ మీద 14 కోట్లు వరకూ పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు అవి రికవరీ అవటం చాలా కష్టమని అంటున్నారు.

     Lagadapati Sridhar's Rs 14 Crore at Stake

    ముఖ్యంగా స్టార్ హీరో,స్టార్ డైరక్టర్ కలిసినప్పుడు ఏర్పడిన అంచనాలను ఈ చిత్రం కొంచెం కూడా అందుకోలేకపోయింది. బలహీన కథ,కథనంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ కు వచ్చే సరికి పూర్తి స్ధాయి బోర్ గా మారింది.

    రాజూ భాయ్‌ (సూర్య) అనే డాన్‌ కథ ఇది. చీకటి ప్రపంచాన్ని చిటికె వేసి నడిపించే తెలవితేటలు, దమ్ము ఉన్నవాడు. స్నేహానికి ప్రాణమిస్తాడు. అలాంటి రాజూ భాయ్‌ని స్నేహం పేరుతో మోసగిస్తే ఎలా స్పందించాడు? తన పగను ఎలా, ఏ రూపంలో తీర్చుకొన్నాడు అనే ఈ రొటీన్ కథని అంతకన్నా పరమ రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించి ప్రేక్షకుడు సహనంతో ఆడుకున్నారు దర్శకుడు లింగు స్వామి. ఇక ప్లస్ అవుతుంది అనుకున్న సమంత గ్లామర్ సైతం సినిమాకు కలిసిరాలేదు.

    English summary
    
 Lagadapati Sridhar has reportedly pumped in more than 14 crores in Telugu version of "sikandar" and it could be big gamble, considering the tanda openings at the box office, due to a non-impressive plot and routine stuff.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X