twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ హవా కి హీరో రామ్ బ్రేకులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేదీ...ఏడవ వారంలోనూ ఇంకా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా అలాగే కంటిన్యూ రన్ ఇస్తూ డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటిర్స్ కి ఆనందం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. డైలీ ఎపి షేర్ దాదాపు ముప్పై లక్షలు సంపాదిస్తోంది. నవంబర్ 15 కి యాభై రోజులు మార్క్ చేరుతుంది. 50 రోజుల నాటికి 190 డైరక్ట్ థియోటర్స్ ఉన్నాయి. అయితే రామ్ హీరోగా నటించిన మసాలా రిలీజ్ తో ఆ పరిస్ధితి లో మార్పు వచ్చేటట్లు కనపడుతోంది. నవంబర్ 14 న అంటే 48 వ రోజున ఈ చిత్రాన్ని మసాలా కోసం థియోటర్స్ నుంచి తీసేస్తారు. ఇది పవన్ ఫ్యాన్స్ కు బాధ కలిగించే విషయమే.

    వెంకటేష్, రామ్ ప్రధాన పాత్రల్లో విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'మసాలా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది. నవంబర్ 14న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందుతోంది. వెంకటేష్‌, రామ్‌ సరసన అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌ నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పకులు.

    ఈచిత్రం మొత్తం రన్నింగ్ టైం 145 నిమిషాలు. ఇద్దరు హీరోలను ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఫోకస్ చేసారు. వెంకటేష్, రామ్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమా ప్లస్సవుతుందనే టాక్ వినిపిస్తోంది. పాటలన్నీ ఎంతో అందంగా చిత్రీకరించారట. సినిమా మొత్తం ఫుల్ కామెడీతో వినోద ప్రధానంగా సాగిందని, వెంకటేష్, రామ్ తమ కెరీర్లోనే బెస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చారని, సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా సాగుతోందని, నిర్మాణ విలువలు బాగున్నాయని....హిందీలో హిట్టయిన సినిమాకు రీమేక్ కావడం, వెంకీ, రామ్ లాంటి స్టార్లు నటించడంతో సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.

    రామ్‌ మాట్లాడుతూ ''నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా తీశారు. మద్రాసులో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నప్పుడు నేను సెట్‌కి వెళ్లేవాణ్ని. మళ్లీ అదే బృందం కలిసి పనిచేసిన ఈ సినిమాలో ఇప్పుడు నేను భాగం కావడం ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. వెంకటేష్‌గారితో కలిసి నటించడం ఎంతో సంతృప్తినిచ్చింది. చిత్రసీమకు నాలుగు మూల స్తంభాలుంటే అందులో ఒకరు వెంకటేష్‌. కథ, కథనాలపై నమ్మకంతో ఈ సినిమా చేశాం'' అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ''సరికొత్త రుచులను పంచే మసాలా ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకటేష్‌, రామ్‌లు కలిసి చేసే సందడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందనవస్తోంది''అన్నారు. అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్‌.ఎస్‌.నారాయణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆండ్రూ, సంగీతం: తమన్‌.

    English summary
    Attarintiki Daredi is in to its seventh week and the film's golden run is continuing unabated grossing around Rs 30 lakhs (share in AP) and is marching towards the fifty day mark on 15th of November. Currently the Pawan Kalyan starrer is playing in more than 190 screens apart from late release theaters and shifts and has very good chance to complete fifty days run in all these direct centers. But it is going to lose few of them to Masala, which is due to release November 14 and Attarintiki Daredi is going to be replaced by in few centers for 48 days and Pawan fans are not happy about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X