twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్ ...నాగచైతన్య చిత్రానికి ఇంకా టైం రాలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆటోనగర్ సూర్య' . ఆర్దికపరమైన సమస్యలతో చాలా కాలం ఆగిపోయిన ఈ చిత్రం ఆ మధ్య మళ్లీ మొదలైంది. దర్శక,నిర్మాతలు హడావిడీగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మళ్లీ ఫోస్ట్ ఫోన్ అయ్యింది. మార్చి నెలాఖరుకు కి గానీ విడదల అయ్యే అవకాసం కనపడటం లేదని తెలుస్తోంది. దానికి కారణం ఈ ఫిభ్రవరి నెల మొత్తం వరస సినిమాల రిలీజ్ లతో బిజీగా ఉండటమే అంటున్నారు.

    మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆంధ్రా రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. దాదాపు ఎనిమిది కోట్లు ఈ రైట్స్ నిమిత్తం వెచ్చించినట్లు చెప్తున్నారు. దాంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక నెల్లూరు రైట్కస్ ని హరి పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి 22 కోట్లు అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఎంత బిజినెస్ అయినా దాన్ని రీచ్ అవటం కష్టమంటున్నారు.

    Naga Chaitanya and Samantha’s

    అచ్చిరెడ్డి చిత్రం గురించి మాట్లాడుతూ 'మా సినిమాలో రీరికార్డింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే సంగీత దర్శకుడు అనూప్ బాగా టైమ్ తీసుకుని అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. రీరికార్డింగ్ పూర్తి కాగానే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తాం. ఈ చిత్రంలో నాగచైతన్య క్లాస్ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో మరో హిట్ మూవీ అవుతుంది. అలాగే 'ప్రేమ కావాలి', 'పూలరంగడు' చిత్రాల తరువాత మా బేనర్‌కి 'ఆటోనగర్ సూర్య' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

    విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    Naga Chaitanya and Samantha’s ‘Auto Nagar Surya’ has been postponed again. Sources say that the movie will now release in March. The news has not been confirmed officially. February month is already filled with several releases and this is said to be the reason behind this decision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X