twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా...అక్కడ పెద్ద హిట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ,ఇమేజ్ మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆయన కెరీర్ లో పెద్ద ఫ్లాఫ్ గా నిలిచిన రామయ్యా వస్తావయ్యా చిత్రం డిజాస్టర్ అయ్యింది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కావటంతో సినిమాపై హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని నీరుగారుస్తూ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే ఇప్పుడా చిత్రం యూ ట్యూబ్ లో వీరవిహారం చేస్తోంది.

    ఫిభ్రవరి ఇరవై న యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే ఇప్పటివరకూ 12 లక్షలమంది దాకా ఈ చిత్రాన్ని చూడటం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే దీనికి కారణం...ఈ సినిమా ఫ్లాఫ్ అనగానే థియోటర్ కి వెళ్ళి చూద్దామనుకునే జనం ఆగిపోయారు. ఇప్పుడు వారంతా యూ ట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నారంటున్నారు. యూ ట్యూబ్ లో చూడటం ఓ లాభం ఉందంటున్నారు. మనకు బోర్ అనిపించిన భాగం ను స్కిప్ చేసే అవకాసం ఉంటుందంటున్నారు. ఏదైమైనా ఈ సూపర్ రెస్పాన్స్ కు యూ ట్యూబ్ రైట్స్ తీసుకుని అప్ లోడ్ చేసిన ఆదిత్యా మూవీస్ వారు మురిసి పోతున్నారు.

    NTR's Ramayya Vastavayya is a huge hit in Youtube

    దర్శకుడు హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది. ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది.

    కథేమిటంటే...ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.

    English summary
    NTR's last release Ramayya Vastavayya is receiving superb response on Youtube. Recently Aditya Movies uploaded Ramayya Vastavayya full movie on its Youtube Channel. Ramayya Vastavayya was uploaded on Feburuary 20 and already more than 11.5 lakh people watched it online.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X