twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: రేసుగుర్రం....'లెజండ్' ని రీచ్ కాలేదా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఏకైక మాట...బాలకృష్ణ హిట్ చిత్రం 'లెజండ్' ని రేసు గుర్రం ఫస్ట్ డే కలెక్షన్స్ రీచ్ కాలేకపోయిందా అనేదే. ఇది నిజం అని ఓ వర్గం లెక్కలు చూపిస్తోంది. వారు చెప్పే లెక్కలు ప్రకారం...రేసుగుర్రం చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ 6.7 అయితే లెజండ్ చిత్రానికి 7 కోట్లు వరకూ వచ్చిందంటున్నారు. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో ఈ వీకెండ్ కలెక్షన్స్ కు ఢోకా లేదంటున్నారు. అయితే అధికారికంగా ఎవరూ లెక్కలు బయిటపెట్టరనేది మాత్రం నిజం. ఈ లెక్కలన్నీ ఎవరికి వారు తమ పరిధిలో తమకున్న ట్రేడ్ సమాచారాన్ని బట్టి వేసుకునేవే..ప్రచారం చేసుకునేవే అనేది అందరికీ తెలిసిన విషయమే.

    'రేసు గుర్రం' చిత్రం ఇటీవల విడుదలైన హిట్ మూవీ 'లెజెండ్' చిత్రానికి మంచి ఫాలో అప్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బిజినెస్ ఈ రేంజిలో సాగడం సమ్మర్లో విడుదలయ్యే ఇతర పెద్ద సినిమాలకు కూడా శుభ సూచకమని చెప్తున్నారు. 'రేసు గుర్రం' చిత్రం అన్ని ఖర్చులూ కలుపుకుని థియేటర్లోకి వచ్చే సమయానికి రూ. 52 కోట్ల బడ్జెట్ అయిందని తెలుస్తోంది.

    Race Gurram Day 1 Collections: Not Reached Legend

    కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్

    English summary
    As per reports, Race Gurram Day 1 collections are expected to be around 6.7 crores worldwide, which is less than Balakrishna’s Legend(7 crores), but due to positive talk it is expected to perform good in coming weekend followed by Monday holiday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X