twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "రేసు గుర్రం" USA కలెక్షన్స్ ఇవీ...

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ సైతం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ అన్న రీతిలో వచ్చాయి. ఇండియాలో సరే...USA లో కలెక్షన్స్ పరిస్ధితి ఏమిటీ అంటే... ప్రీమియర్ షో ఓ మాదిరిగా స్లోగా ఉన్నా మార్నింగ్ షో నుంచి అక్కడా పుంజుకుని హై స్పీడుతో టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ క్రింది విధంగా అక్కడ వసూలు చేసింది.. మెదటి రెండు రోజుల కలెక్షన్స్ పై ఓ లుక్ వేయండి.

    ప్రీమియర్ షో (గురువారం) : $102,000

    శుక్రవారం: $205,000

    మొత్తం రెండు రోజులకు: $307,000

    Race Gurram USA Collections Report

    ఇదే స్పీడు కనుక కంటిన్యూ అయితే జులాయి USA గ్రాస్ $840,000 ని క్రాస్ చేస్తుందనటంలో సందేహం లేదంటున్నారు.

    అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    స్టోరీ లైన్ గా సునీల్, నాగచైతన్య నటించిన 'తడాఖా' గుర్తుకు వచ్చినా దాన్ని విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్, కామెడీ సన్నివేశాలతో మైమరిపించగలిగారు. ఫక్తు కామెడీ వ్యవహారం కావటంతో ట్విస్ట్ లు లేకపోవటమే కలిసివచ్చింది. 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు.

    English summary
    Race Gurram opened with slow premiere but Friday it was running at high speed in USA Box office. If it goes at this same speed on Sat and Sun also, it may cross julayi USA gross which was about $840,000.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X