twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భీమవరం బుల్లోడు' కలెక్షన్స్ పరిస్దితేంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'భీమవరం బుల్లోడు' మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా సొంతగా అన్ని ఏరియాలు సురేష్ బాబు రిలీజ్ చేసుకున్నారు. సునీల్ కెరీర్ లోనే ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేసిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉందని, ఏడు కోట్లు వరకూ షేర్ వసూలు చేసిందని సమాచారం. వీకెండ్స్ లో అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ తో నడవటంతో మంచి షేర్ వసూలు చేసిందని చెప్తున్నారు. బడ్జెట్ రికవరికి ఈ వారం ఇదే కలెక్షన్స్ కంటిన్యూ అయితే సరిపోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక శాటిలైట్ మీద వచ్చే మొత్తాలు,నాన్ థియోటరకల్ రిలీజ్ నుంచి వచ్చే మొత్తాలు అదనం అంటున్నారు. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనే దానిపై ఈ లెక్కలు ఆధారపడి ఉంటాయి.

    Suresh Movies strikes Rich with Bhimavaram Bullodu
    సురేష్ బాబు మాట్లాడుతూ...'సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం' అన్నారు.
    సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

    హీరో సునీల్ మాట్లాడుతూ 'కమెడియన్‌గా నా నుంచి ప్రేక్షకులు మిస్సవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటించారని అన్నారు.

    తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

    English summary
    Bhimavaram Bullodu film as things stand now is heading for 7Cr Nizam/AP Share weekend. A Suresh Own release all over, it looks like it will recover its Budget from Theatricals alone that too in a Week!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X