twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న ‘ఉయ్యాలా జంపాలా’కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

    Uyyala Jampala
    దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ "కథ కల్పితమైనా, గ్రామంలో నేను చూసిన కొన్ని పాత్రలను ఇందులో చూపించాను. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ఊరిని చూడాలనుకుంటారు. పల్లెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో సహానుభూతి చెందుతున్నారు'' అని చెప్పారు. ఈ సినిమాలో హీరో, తను ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటామనీ, ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయినీ, సన్నీ సంగీతం సమకూర్చిన పాటలన్నీ బాగా వచ్చాయనీ హీరోయిన్ అవిక తెలిపారు.

    విరించివర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్, అవిక ('చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ఆనంది) హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. డి. సురేశ్‌బాబు సమర్పించారు. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.

    English summary
    
 ‘Uyyala Jampala’ is one of the most profitable Telugu movies of 2013. The production unit incurred a cost of approximately 2.5 Crores (including publicity). Revenues are now close to the 17 Crore Mark (Gross)!. Avika Gor and Raj Tarun have played the lead characters in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X