twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1-నేనొక్కడినే' బిజినెస్ క్లోజ్... రెవెన్యూ వివరాలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం మార్నింగ్ షో నుంచీ డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ 70 కోట్లు(ప్రమోషన్,పబ్లిసిటీ,ప్రింట్ కాస్ట్ వగైరా). రాబడి వివరాలు పరిశీలిస్తే...

    థియోటర్ రెవిన్యూ (డిస్ట్రిబ్యూటర్ షేర్...హైర్స్,ఎమ్ జి కలిపి) దాదాపు 29 కోట్లు
    మిగతా సోర్స్(శాటిలైట్,డబ్బింగ్,మ్యూజిక్ వగైరా రైట్స్) నుంచి వచ్చిన రెవిన్యూ 14-15 కోట్లు.
    మొత్తం చిత్రం నిమిత్తం వచ్చిన రెవిన్యూ దాదాపు 44 కోట్లు రూపాయలు మాత్రమే.
    నష్టం...26-27 కోట్లు వరకూ...

    Verdict : 1 Nenokkadine loss or Profit?

    అయితే ఈ చిత్రాన్ని 72 కోట్లకు ఈరోస్ వారు కొంటున్నట్లు అఫీషియల్ గా నిర్మాతలు తెలిపారు. దాంతో నష్టాలు వారికే మొత్తం వెళ్తాయని అంతా భావించారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి వారు డబ్బు మొత్తం ఇచ్చి తీసుకోలేదట. కేవలం ఈ సినిమాకు ఫైనాన్సియల్ సపోర్ట్ చేసారని చెప్తున్నారు. దాంతో ఈ చిత్రంపై వచ్చిన నష్టాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్ధ వాళ్లవే అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు.

    ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

    గమనిక: పైన చెప్పబడ్డ లెక్కలు..కేవలం ట్రేడ్ లో చెప్పుకుంటున్నట్లువే...అధికారిక సమాచారం కాదు

    English summary
    Mahesh's '1', a loss of 26-27Cr is evident straight event after all the satellite rights and audio rights prices are included.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X