twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫు హీరోపై 18 కోట్లు ...రిస్క్ ఏమో?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓ ప్రక్క హీరోలు రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలని, నిర్మాతలు బడ్జెట్ లు జాగ్రత్తగా చూసుకుని ప్లాన్ చేసుకోవాలి అంటూ ఫిల్మ్ ఛాంబర్ చెప్తూంటే...ప్లాఫ్ హీరో మీద కూడా 18 కోట్లు పెట్టి గాంబ్లింగ్ ఆడుతున్నారని చెప్పుకుంటున్నారు సినిమావాసులు. ఇంతకీ ఏ సినిమా గురించి అంటారా..రామ్ హీరోగా రూపొందుతున్న 'పండగ చేస్కో' చిత్రం బడ్జెట్ గురించి టాలీవుడ్ లో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. వినిపిస్తున్న రూమర్స్ నిజమైతే ...18 కోట్లు వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పై భారీ పెట్టుబడే అంటున్నారు.

    రామ్ హీరోగా వచ్చిన ఒంగోలు గిత్త, మసాలా, ఎందుకంటే ప్రేమంట చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాలు నమేదు చేసి భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ నేపధ్యంలో షాడో తో డబ్బులు పోగొట్టుకున్న నిర్మాత పరుచూరి ప్రసాద్ ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రానికి బలుపు వంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నా ఊహించిన రీతిలో క్రేజ్ అయితే క్రియేట్ కాలేదు. దాంతో ఎంతవరకూ ఈ బడ్జెట్ ని రికవరీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.

    ఈ చిత్రంలో రామ్ ...ఎన్నారై గా కనిపిస్తాడని, అతను తన కుటుంబ సమస్య పరిష్కరించటానికి ఇండియా వస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అత్తారింటికి దారేది,సెకండాఫ్ ...మిర్చిని గుర్తుకు తెస్తూ సాగుతుందని వినిపిస్తోంది. అయితే ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ హీరో. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.

    18 Cr gamble on Ram ?

    దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ... డాలర్లలో మునిగి తేలిన కుర్రాడతను. కోరుకొంటే విలాసవంతమైన జీవితం అతని కాళ్ల ముందు ఉంటుంది. కానీ అదేం వద్దనుకొన్నాడు. తన వాళ్ల కోసం స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికొచ్చి ఏం చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాలి అంటున్నారు . ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.

    అలాగే ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''తనవారి శ్రేయస్సు కోసం పాటుపడే కుర్రాడి కథ ఇది. ప్రతి సన్నివేశం ఓ పండగలా ఉంటుంది. రామ్‌ నటన, డ్యాన్స్‌, పోరాటాలూ.. తప్పకుండా ఆకట్టుకొంటాయి. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు.

    చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌

    English summary
    Despite burning his hands with disaster Shadow, leading producer Paruchuri Prasad reportedly pumping 18 crores on Ram in "Pandaga chesko'. producer is hoping that young director gopichand mallineni who had hits like "Bodyguard" and "Balupu" could spin box office magic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X