twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దాన వీర శూర కర్ణ'రీమేక్ లో ఎన్టీఆర్?

    By Staff
    |

    Jr Ntr
    ఎన్టీఆర్ తనకెంతో ఇష్టమైన తన తాతగారి దాన వీర శూర కర్ణ చిత్రాన్ని రీమేక్ చేయాలని సంకల్పిస్తున్నట్లు సమాచారం.ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని ఆయన చర్చలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ధీరుడు చిత్రం అనంతరం ఈ భారీ ప్రాజెక్టుని చేపట్టమని రాజమౌళిని అడగాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా కూడా తనే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

    ఇక ఈ చిత్రంలోని వచ్చే ముఖ్య పాత్రలను పెద్ద ఎన్టీఆర్ లాగే తాను చేయాలని అలా తన పౌరాణికాలలో తాను రాణించగలనని చెప్పాలనుకుంటున్నారు. యమదొంగలో తన యముడు గెటప్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ ఆలోచన చేయటానికి కారణం అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంభందించిన పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ ఇంత చిన్న వయిస్సులో అంత పరిణితి చెందన పాత్రలు చేయటం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంగా సూచిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X