twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ఉండగా ఆమెకేంటి?

    By Staff
    |

    Ravi Teja
    రవితేజ తాజా చిత్రం కిక్ లో మెరుపులా మొదటి సీనులో కనిపించిన సైరాభాను ఇప్పుడు బిజీ స్టార్ అవుతోంది. ఆమెకు రవితేజ అండదండ, ఆశీస్సులు పుష్కలంగా ఉండటమే దీనికి కారణమంటున్నారు. టీవీ ఫీల్డు నుంచి వచ్చిన సైరాకి రవితేజ సోదరుడు భరత్ స్నేహితుడు కావటంతో కిక్ లో ఛాన్స్ దక్కింది. అయితే అప్పుడు రవితేజ ఆమెలో టాలెంట్ ని గమనించి తనకు తెలిసున్న కంపెనీలకు రికెమెండ్ చేసారని వినికిడి. దాంతో ఆమె కిక్ షూటింగ్ కి తన సీన్స్ లేనప్పుడు కూడా వచ్చి కాస్సేపు కబుర్లు చెప్పి పోతూండేదని చెప్పుకున్నారు.

    ఇక రవితేజ ఆమె గురించి చెపుతూ ఆమె మంచి స్నేహితురాలని కితాబిచ్చేసాడు. అయితే అందరూ ఆమెకు కిక్ లో లాగానే తమ సినిమాలో ఒక సీన్ లో కన్పించమంటున్నారుట. దాంతో రవి కంగారుపడద్దుని త్వరలోనే మంచి అవకాశం వస్తుందని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక అంత పెద్ద హీరో అండాదండా ఉంటే తనకేంటని ఇంతకు ముందు ఒప్పుకున్న చిన్న చితకా వేషాలు వేయకుండా తిప్పించుకుంటోంది. దాంతో ఆ నిర్మాతలు గోలెత్తుతున్నారు. సైరాబాను ఇంతకు ముందు ఫిటింగ్ మాస్టర్ లో నటించింది. ఆ తర్వాత అనగనగా ఓ అరణ్యం చిత్రం ప్రారంభమయ్యింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X