"మగధీర" చిత్ర ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ చిత్ర హీరో, జూనియర్ మెగాస్టార్ రామ్ చరణ్ ఈ అమ్మడుపై మనస్సు పారేసుకున్నాడట. 'మగధీర' సినిమాలో తన ప్రేమను దక్కించుకునేందుకు పూర్వజన్మలో ప్రాణత్యాగం కూడా చేస్తాడు. ఈ ప్రేమే నిజ జీవితంలోనూ కాజల్‌పై చూపిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.అందుకే..తన తదుపరి చిత్రం "ఆరెంజ్"లో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు భాస్కర్ కి చరణ్ సూచించినట్టు సమాచారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు రేపు (అక్టోబరు 21న) జరగనున్నాయి. డిసెంబరు మొదటి వారం నుంచి విదేశాల్లో షూటింగ్ రెగ్యులర్ జరుపుకోనుంది.
ఈ చిత్రం కథా పరంగా ఇందులో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒక హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని చరణ్ కోరారట. మెయిన్ హీరోయిన్‌గా జెనీలియాను ఎంపిక చేశారు. కానీ కాజల్ మాత్రం ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటం వల్ల నిరాకరించినట్టు సమాచారం. దీంతో రామ్ చరణ్ తలదూర్చి రెండో హీరోయిన్ పాత్ర నిడివి పెంచాలని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను కోరాడట. వీరి ప్రేమకథ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.