Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్నేహ, నయనతారలకు బాలకృష్ణ నోటీసులు
ఏ పరిస్థితుల్లో స్టార్ నైట్ కు హాజరు కాలేదనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ నయనతార, స్నేహలకు ఈవెంట్ కన్వీనర్ నందమూరి బాలకృష్ణ నోటీసులు పంపారు. ఈ నోటీసుపై వారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అలాకాని పక్షంలో తెలుగు సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లకు అవకాశాలు లేకుండా బ్యాన్ అమలవుతుందని సమాచారం. వరద బాధితుల సహాయార్థం ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'స్పందన' స్టార్ నైట్ కార్యక్రమానికి హాజరుకాని నటీనటులపై చర్యకు రంగం సిద్ధమవుతోంది. ఈ షోకు అటెండుకాని త్రిష ఆ కమిటీకి ముందుగానే తెలియపరిచిందని తెలుస్తోంది.
పరిశ్రమలోని అన్ని విభాగాల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పరిశ్రమకి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఎవరైతే ఈ ఈవెంట్ కు దూరంగా ఉంటారో వారిపై నిషేధం విధిస్తామని ఈవెంట్ హానరరీ చైర్మన్ డాక్టర్ దాసరి నారాయణరావు స్టార్ నైట్ ముందు జరిగిన సమావేశంలో హెచ్చరించారు. అయితే దీనిని బేఖాతరు చేస్తూ ఈ ఈవెంట్ కు హాజరుకాని నయనతార, స్నేహలపై బ్యాన్ వేటు పడనుందని తాజా సమాచారం.ఇక ప్రస్తుతం నయనతార 'అదుర్స్' చిత్రంలోనూ, స్నేహ 'భవాని ఐపిఎస్', 'అమరావతి' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.