twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిజికల్ ఫిటినెస్ ట్రైనర్ తో లింక్ లేదు..లక్ష్మీరాయ్

    By Srikanya
    |

    కాంచనమాల కేబుల్ టీవి,పౌర్ణమి వంటి చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన లక్ష్మీరాయ్ చేసే సినిమాల్లో కన్నా వివాదాల్లోనే ఎక్కువ హాట్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ధోణితో ఆమె రిలేషన్ కు ఫుల్ స్టాఫ్ పడకుండానే..ఫిజకల్ ఫిటనెస్ ట్రైనర్ ప్రశాంత్ తో వ్యవహారం నడిపిస్తోందంటూ వార్తలు వినిపిస్తోంది. ఈ మేరకు ముంబయి టాబ్లయిడ్స్ లో వారి ఫోటోలతో పాటు వార్తలు హాట్ హాట్ గా వచ్చాయి. ఆ విషయం గమనించిన లక్ష్మీ రాయ్ మీడియాను కలిసి తనకూ ప్రశాంత్ కు ఏ సంబంధం లేదని,తమ మధ్య ఉన్న స్నేహపూర్వకమైన రిలేషన్ ను చెడగొట్టవద్దని చెప్పింది. ఆమె ఇలా ఉలికి పడి భుజాలు తడుముకుని మరీ స్టేట్ మెంట్ ఇవ్వటంతో ఆమెకీ,ప్రశాంత్ కీ మధ్య ఏదో ఉందనే నిర్ణయానికి అంతా వచ్చేసారు.

    ఇక ప్రశాంత్ ని రీసెంట్ గా ఆమె ఫిటెనెస్ కోసం ఏర్పాటు చేసుకుంది. తన బరువు పెరగటంతో రాబోయే హిందీ సినిమాకు ఇబ్బంది ఎదురవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తోంది.ఉదయం ఐదు నుంచి ఏడు వరకూ అతనితో ఏరోబిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని, ఆ తర్వాత షూటింగ్స్ కు అటెండవుతున్నానని అంటోంది. అయితే అతను ఆమె ఇద్దరూ ఒకే చోట నివాశముండటమే ఈ రూమర్స్ కు అవకాశమిస్తోందని వాపోతోంది.అలాగే ప్రశాంత్ కు పెళ్లి పిక్స్ అయిందని అతని ఫ్యామిలీ సర్కిల్స్ లో ఈ రూమర్స్ వల్ల సమస్యలు వచ్చే అవకాశముందని..కాబట్టి అలా రాయద్దని రిక్వెస్ట్ చేస్తోంది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X