twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిను వీడని నీడను నేను!

    By Sindhu
    |

    బుల్లితెర నుంచి వెండితెరపై ఓ వెలుగు వెలిగేందుకు బోల్డన్ని ప్రయత్నాలు చేసిన వహీదా, ప్రస్తుతం 'నిను వీడని నీడను నేను" అనే త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ సినిమాతో హీరోయిన్ గా తనకు మంచి గుర్తింపు దక్కుతుందని వహీదా అంటోంది. ఈ చిత్రం దయ్యం కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిదనీ, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందనీ చెప్పారు. ఐదుగురు అందాల తారలు తమ అందాలతో పాటు చక్కటి నటనను ప్రదర్శించనున్నారనీ తెలిపారు.

    గుర్తింపు సంగతెటా వున్నా, వ్యాంప్ కి తక్కువ, ఫ్రెండ్స్ గ్యాంగ్ కి కాస్త ఎక్కువ అన్నట్టు రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసేస్తోంది వహీదా. బుల్లితెర నుంచి చాలా మంది వెండితెరపై ప్రయత్నాలు చేసి, అందులో కొందరు సక్సెస్ అయితే, మరికొందరు తిరిగి బుల్లితెరకి తిరుగుటపా కట్టిన సంగతి విదితమే. అయితే తాను మాత్రం పట్టవదలబోననీ, తెలుగు తెరపై హీరోయిన్ గా సక్సెస్ అయ్యేవరుకూ ప్రయత్నిస్తాననీ అంటోంది వహీదా. అందుకే కాబోలు సినిమా టైటిల్ కూడా 'నిను వీడని నీడను నేను" అలాగే ఉంది. ఈ చిత్రాన్ని గంగోత్రి ఫిలింస్ సమర్పణలో తిరైపులి డాట్ కామ్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. బాబు గణేష్ కథానాయకుడుగా నటించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇబ్రాఖాన్, విక్టోరియా, స్టెఫీ హీరోయిన్లుగా మరో హీరో శ్రీమాన్ నటిస్తుండగా కృష్ణ భగవాన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X