Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కిరాయి కోటిగాడు' గా అలరించనున్న మహేష్ బాబు?
కృష్ణ కెరీర్ లో కిరాయి కోటిగాడు చిత్రం ఓ సూపర్ హిట్. ఇప్పుడు ఆ మ్యాజిక్ ని ఆయన తనయుడు మహేష్ మరో సారి గుర్తు చేయనున్నాడు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కలేజా చిత్రంలో కృష్ణ హీరోగా చేసిన కిరాయి కోటిగాడు చిత్రంలోని ఓ పాటను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు మణిశర్మ ఓ కొత్త ట్యూన్ తో ఈ సాంగ్ ని చేసి ఒప్పించాడని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ పాట కోసం కౌబాయ్ గెటప్ వేసుకుని కనిపిస్తాడని చెప్తున్నారు. ఇంతకుముందు జయంత్ తో చేసిన టక్కరి దొంగ చిత్రంలోనూ అదే గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పోకిరీ చిత్రంలోనూ కృష్ణ...కృష్ణ వేణి చిత్రంలోని గల గల పారుతున్న...అనే రీమిక్స్ ని అందించి అధ్బుతం అనిపించిన సంగతి తెలిసిందే. మహేష్‌బాబు, అనుష్క జంటగా కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. గత రెండు నెలలుగా గ్యాప్ తీసుకున్న ఈ చిత్రం గతనెల 31నుంచి మళ్లీ రెగ్యులర్ షూటింగ్‌ని ఫిలింసిటీలో జరుపుకుంటోంది.