Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలకృష్ణ క్రేజ్ తోటే మళ్లీ ఫామ్ లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్...
బి గోపాల్ బాలకృష్ణ కాంబినేష్ కున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన 'లారీ డ్రైవర్", 'రౌడీ ఇన్స్ పెక్టర్" చిత్రాలు సూపర్ హిట్టవ్వగా, 'సమరసింహా రెడ్డి", 'నరసింహనాయుడు" సంచలన విజయం సాధించాయి. అయితే చిరంజీవితో రూపొందిన ఇంద్ర తర్వాత బి గోపాల్ కు హిట్టన్నది లేదు. బాలకృష్ణతో రూపొందించిన 'పల్నాటి బ్రహ్మనాయుడు," ఎన్టీఆర్ తో తెరకెక్కించిన 'అల్లరి రాముడు", ప్రభాస్ తో దర్శకత్వం వహించిన 'అడవిరాముడు" చిత్రాలతో పాటు ఎన్టీఆర్ తో రూపొందిన 'నరసింహుడు" పరాజయం పాలయ్యాయి. రామ్ తో రూపొందించిన 'మస్కా" కూడా అంతంతమాత్రంగానే ఆడింది.
'మస్కా" చిత్రం తర్వాత నుంచి ఖాళీగానే ఉంటున్న బి గోపాల్ దర్శకత్వంలో ఆమధ్య గోపిచంద్ తో ఓ సినిమా రూపొందనుందంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ నందమూరి బాలకృష్ణతోనే ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించేందుకు బి గోపాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. బెల్లంకొండ సురేష్ చిత్రాన్ని నిర్మించనున్నారు..అదీ సంగతీ..