twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్డున కొత్త చిత్రం టైటిల్ 'ఢమురుకం' గా ఫిక్స్

    By Srikanya
    |

    నాగార్జున,శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న చిత్రానికి "ఢమురుకం"అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర నిర్మాతలైన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసారు. ఇక ఈ చిత్రం గురించి శ్రీనివాస రెడ్డి ..నాగార్జునగారితో సినిమా నిర్మించాలనేది నా చిరకాల కోరిక. ఆ కోరిక ఈ ఏడాదే నెరవేరుతుండటం చాలా ఆనందంగా ఉంది. ముందెన్నడూ చేయని అద్భుతమైన పాత్రను ఇందులో నాగార్జున చేస్తున్నారు. నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన్ను ఎలాంటి సినిమా చేయాలని ఆభిమానులు ఆశిస్తున్నారో..ఆ స్థాయిలో కథను రెడీ చేశారు అంటున్నారు. ఇక ఈ చిత్రం అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ అని సమాచారం. అనుష్క హీరోయిన్ గా చేసే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రస్తుతం నాగార్జున..బిందాస్ దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో రగడ చిత్రం పూర్తయింది. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో గగనం కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X