వైయస్ జగన్ స్పూర్తితోనే పవన్ చిత్రం?

శుక్రవారం, జనవరి  27, 2012, 18:40 [IST]
YS Jagan - Pawan Kalyan
దాదాపు పన్నెండేళ్ళ తర్వాత తెరకెక్కుతున్న కాంబినేషన్ .. పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్. బద్రి సినిమాతో 2000లో కెరీర్ ప్రారంభించిన పూరీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం కోసం వైయస్ జగన్ జీవితం స్పూర్తితో కథ రెడీ అయ్యిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కథ ను రూపొందించారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కథను తెరకెక్కిస్తానన్న పూరీ అప్పట్లో అది కుదరక వదిలేసారు. కానీ ఇప్పుడు ఆ కథనే కొద్దిగా పాలిష్ చేసి ఆయన కొడుకు క్యారెక్టర్ ని ముందుకు తెచ్చి ఈ కథను వండుతున్నారని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుత రాజకీయాలపై పదునైన డైలాగులు రాసేందుకు అవకాశముంటుందని ఈ కథను ఎన్నుకున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ కథపై ఆసక్తి చూపి వెంటనే డేట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక మే నెలనుంచే షూటింగ్ మొదలవుతుందని పూరీ ట్వీట్ కూడా చేసి కన్ఫర్మ్ చేసారు.ఇక బిజినెస్ మ్యాన్ హిట్టుతో పూరి తెలుగులో తిరుగులేని దర్శకుడుగా మరోసారి నిరూపించుకోవటంతో అందరు హీరోలు ఆయన దర్శకత్వంలో చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఆరు నెలల క్రిందట దాకా వరస ఫ్లాపుల్లో ఉన్న పూరీ తమని హీరోగా ఎక్కడ అడుగుతాడో అని భయపడి డేట్స్ ఖాళీ లేవని మేనేజర్ల చేత చెప్పిన హీరోలందరూ క్యూ కడుతున్నారు.
English summary
Pawan Kalyan role was moulded taking YS Jagan as role model in Puri Jagannath's FIlm.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST