క్రిష్ దర్శకత్వంలో సమంత ఖరారు

ఆదివారం, జనవరి  29, 2012, 14:13 [IST]
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ స్టార్ ఎవరంటే సమంత. తెలుగులో కంటిన్యూగా సినిమాలకు వరసగా డేట్స్ ఇచ్చి వాటిని ఎడ్జెస్ట్ చెయ్యలేక ఇబ్బందిపడుతున్న ఆమె ఇప్పుడు క్రిష్ డైరక్షన్ లో చేయనుంది. అయితే ఆమె డేట్స్ ఇచ్చింది సినిమాకి మాత్రం కాదు. ఓ యాడ్ లో నటించటానకి ఆమె గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎంబాసిడిర్ గా ఆమె కమిటైంది. ఆమెతో ఆ ప్రొడక్టు ప్రమోట్ చెయ్యటానికి క్రిష్ డైరక్షన్ లో ఓ యాడ్ ని షూట్ చెయ్యనున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ జరగనుంది.

ఇక సమంత వరసగా సిద్దార్ధ సరసన బెల్లంకొండ సురేష్ చిత్రం,రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రం,మహేష్ సరనస దిల్ రాజు చిత్రం,నాని సరసన ఈగ,గౌతమ్ మీనన్ చిత్రాలు చేస్తోంది. మరోప్రక్క ఆమె వీరికి డేట్స్ సరిగా ఎడ్జెస్ట్ చేయలేకపోవటంతో ఇప్పటికే సమంత మీద బెల్లకొండ సురేష్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. ఎందుకంటే ఆమె తాను నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ద హీరోగా చేస్తున్న చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయిందని మొదట కమిటైన కమిట్మెంట్ కు కట్టుబడి ఉండటం లేదని అన్నారు. ఇక మరో ప్రక్క ఆమె దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి సైతం డేట్స్ ఇవ్వలేకపోవటంతో ఆ చిత్రం షూటింగ్ వాయిదా పడి ఇప్పుడు లేటుగా మొదలైంది. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా ఆమె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందే ఎవడు చిత్రం చేస్తోంది. అంతేగాక ఇలా యాడ్ ఫిల్మ్ లు చేస్తోంది.
English summary
Top Actress Samantha is soon going to work under director Krish.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST