పవన్ 'గబ్బర్ సింగ్' బిజినెస్ ట్రిక్స్

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 8:49 [IST]
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ మంచి క్రేజీ ప్రాజెక్టుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం కు ప్రమోషన్ వర్క్ చాలా ముందుగా స్టార్ట్ చేస్తున్నారు. పంజా చిత్రం ఊహించని విధంగా ప్లాప్ కావటంతో ఆ ఎఫెక్టు గబ్బర్ సింగ్ మీద పడకుండా నిర్మాతలు జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే వస్తున్న బిజినెస్ ఆఫర్స్ పవన్ రేంజికి తగినట్లు లేవట. అందుకే తమ సినిమాలో ఉన్న సత్తాను చూపి మరీ బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనతో నిర్మాత ఉన్నాడని చెప్తున్నారు. అందుకే నితిన్ ఇష్క్ తో పాటు గబ్బర్ సింగ్ అదిరిపోయే టీజర్ విడుదల చేసి ఇప్పటినుంచీ క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ట్రేడ్ లో వినపడుతోంది.

గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ అంటూ ఆ మధ్య దర్శకుడు ట్విట్టర్ ద్వారా కొన్ని ఫోటోలు విడుదల చేసి హంగామా క్రియేట్ చేసారు. బిజినెస్ కోసం బయ్యర్లలను ఆకర్షించాలంటే ఈ రకమైన బిజినెస్ ట్రిక్స్ తప్పవంటున్నారు. మరో ప్రక్క గబ్బర్ సింగ్ చిత్రం చాలా బాగా వస్తోందని టాక్. హిందీలో విజయవంతమైన చిత్రానికి రీమేక్ కావటం ఈ సినిమాకు ప్లస్ కానుంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తన డైలాగులతో మిరపకాయ చిత్రాన్ని నిలబెట్టినట్లుగానే ఈ చిత్రంలోనూ పంచ్ లతో మాస్ ని అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. పవన్ సైతం పూర్తి మాస్ పాత్రలో చాలా కాలం తర్వాత చేయటం అభిమానులను ఆనందపరుస్తోంది. ‘గబ్బర్‌సింగ్’లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు.

ఆ క్యారక్టైజేషన్ గురించి యూనిట్ వర్గాలు చెప్తూ...చేసే పోలీస్ ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎదురున్న శత్రువుని కూడా తేలిగ్గానే తీసుకుంటాడు. లంచగొండి తనాన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు. కావాలనుకుంటే తను కూడా లంచం తీసుకుంటాడు. కొట్టాలనిపిస్తే ఎవర్నయినా కొట్టేస్తాడు. మూడ్ లేకపోతే... ఎవర్నయినా వదిలేస్తాడు. కానీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇలాంటి సెంటిమెంట్లను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి డిఫరెంట్ కేరక్టరైజేషన్ పవన్ ఇంతకు ముందు చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ అబిమానులను ఆకట్టుకున్నది ఇది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

English summary
The makers of Gabbar Singh are planning to trick the buyers by starting the promotional campaign early.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST