వర్మ దర్శకత్వంలో రాణా ‘ఒక్కడు’ రీమేక్

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 12:30 [IST]
మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఆ మధ్య భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి యువ హీరో ‘రాణా’ ఈ సినిమా రీమేక్ లో నటించాలని చాలా ఆతృతగా ఉన్నాడు. ‘దమ్ మారో దమ్‘ సినిమా ద్వారా ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాణా తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రంలోనూ పవర్ పుల్ రోల్ చే్స్తున్నాడు.

అయితే బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న రాణా అక్కడ సోలోగా మంచి హిట్ కొట్టి పర్మినెంట్ గా పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ‘ఒక్కడు’ సినిమా హిందీ రీమేక్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం....ఈ రీమేక్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నాడని, తన సొంత బ్యానర్ ఆర్.జి.వి ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
English summary
Rana Daggubati is showing his interest to feature in the remake of Super Star Mahesh Babu's block buster hit movie Okkadu in Hindi, says filmnagar sources. Maverick director Ram Gopal Varma is planning to direct and produce this movie under his banner RGV's Factory.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST