twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ అధికారిణి వెనకున్న 'మెగా నిర్మాత'?

    By Srikanya
    |

    హైదరాబాద్: రోజుకో సినిమా వివాదమవుతూంటే.. జనం దృష్టి అంతా సెన్సార్ వైపుకి మళ్లుతోంది. "ధనలక్ష్మి ఇక్కడకు రావడమే పెద్ద స్కామ్. డీఓపీటీలో ఆమెను పక్కనపెడితే, సమాచార ప్రసారశాఖలో డ్రామా జరిగి, ఇక్కడి ఆఫీసర్‌ను బదిలీచేసి, ఆమెను తెచ్చారు. ఆమె ఇక్కడకు ఎలా వచ్చారనే దానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి'' అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఓపెన్ గా రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ చర్చా వేదిక లో చెప్పారు. అదే రోజు మరో ప్రముఖ నిర్మాత నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ... ఆమె ట్రాన్సఫర్ ని ఇక్కడి పెద్ద నిర్మాత ఆపు చేసారని అన్నారు. ఆ మెగా నిర్మాత ఎవరనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

    ఇంతకీ ఎవరా మెగా నిర్మాత అనేదాన్ని రీసెంట్ గా సెన్సార్ వద్ద సమస్యలు ఎదుర్కొని, కట్స్ తప్పించుకుని బయిటపడ్డ సినిమాల లింక్ చూపెడుతున్నారు. ముఖ్యంగా వారి చర్చలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం, బస్ స్టాఫ్, జులాయి చిత్రాలు ప్రస్దావనకు వస్తున్నాయి. ఈ రోజుల్లో పేమ్ మారుతి తాజా చిత్రం 'బస్ స్టాప్'(లవర్స్ అడ్డా) కి సెన్సార్ సమస్యలు ఎదురయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 40 కట్స్ చెప్పిటంతో రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. రివైజింగ్ కమిటీ ఈ చిత్రానికి కేవలం ఐదు కట్స్ తో ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు కి ఈ కత్తెర పడనుందని అంతా భావించారు. రిలీజైన తర్వాత థియోటర్ లో ఆ బూతులు చూసి జనం షాక్ అవుతున్నారు. ఇంతలా సెన్సార్ నుంచి తప్పించుకోవటానికి కారణం ఆ నిర్మాతకీ, చిత్ర దర్శకుడుకీ ఉన్న అనుభందమే అంటున్నారు.

    అలాగే.. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో కట్ చేసిన సంభాషణల లాంటివి జులాయి చిత్రంలో అనుమతిస్తూ సర్ట్ఫికెట్ ఇప్పించడం జరిగింది. నలుగురు సభ్యులు హాజరైన ఒక చిత్రానికి 22 కట్స్ ఇస్తే మరుసటిరోజు ఉదయం అదే సభ్యులను పిలిపించి 22 కట్స్‌ను 12 కట్స్‌కి తగ్గించి వారితో బలవంతంగా సంతకాలు చేయించిన ఉదంతం కూడా ఉందని చెప్తున్నారు. ఈ బాధలను భరించలేని సభ్యులు సూర్యప్రకాష్, విద్యాసాగర్, సునీతా చౌదరి ఢిల్లీకి వెళ్లి సమాచార శాఖ కార్యాలయంలో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.

    సెన్సారు బోర్డులో 88మంది మెంబర్ల నుంచి, ఆ సంఖ్య నేటికి 133కి పెరిగింది. సాధారణ పద్ధతిలో అయితే ప్రతి సినిమాను సెన్సారు సర్ట్ఫికెట్ ఇవ్వడానికి నలుగురు సభ్యులు ఆ చిత్రాన్ని ప్రాంతీయ అధికారితో కలిసి వీక్షిస్తారు. అందులో ఇద్దరు పురుషులు ఇద్దరు స్ర్తిలు ఉంటారు. అలాంటిది ఇప్పుడు అధికారిణి ఆజ్ఞకు తలలూపే ముగ్గురు పురుష సభ్యులను కేవలం ఒకే మహిళా మెంబరును మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఇందుకు ఆగ్రహించిన పలువురు మహిళా సభ్యురాళ్లు ఆ అధికారిణిపై పై అధికారులకు ఫిర్యాదులతోపాటు పత్రికలకూ ఎక్కారు.

    తాము ట్రాన్సఫర్ ఆపుచేయించటంతో తాము నిర్మించే సినిమాలు, తమ వర్గం వారు తీసే సినిమాలకు సెన్సార్ లో ఏ సమస్యలు ఎదురుకాకుండా ఆ మెగా నిర్మాత చూసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇంతకీ కేంద్రంలో ఇన్ఫూలియిన్స్ చేయగలిగిన ఆ నిర్మాత ఎవరంటారు.

    English summary
    Tollywood Producers fights against A. Dhanalakshmi, the regional officer of the AP Censor Board. They rising accusations ranging from corruption to the fact that she is not a native Telugu speaker and therefore "unfit to censor Telugu movies".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X