Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రానా కొత్త చిత్రం టైటిల్ 'కవచం'
ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.
ఇక బాహుబలి చిత్రం గురించి రానా ట్వీట్ చేస్తూ.... " బాహుబలి రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి పది గంటల వరకూ కంటిన్యూగా షూట్ జరుగుతోంది. ఆదివారం అయితే ... ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టి...సోమవారం ఉదయం ఎనిమిదింటి దాకా షూట్ చేసాం.. 24 గంటలు పాటు షూటింగ్ లో పాల్గొన్నాను ."అని ట్వీట్ చేసారు.
తన చిత్రాలు గురించి రానా వివరిస్తూ... భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నా.. ఈ రెండింటిలోనూ హీరోయిన్ అనుష్కే.. నాకన్నా సీనియర్ అని చెప్పుకొచ్చారు. ఇవి కాక అందాల రాక్షసి దర్శకుడు హను దర్శకత్వంలో హిందీ-తెలుగు చిత్రం, సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలు చేస్తున్నా. ఇవి రెండూ మా సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్లోనివే. ఈ షూటింగ్‌లన్నీ దాదాపు ఒకే సమయంలో సాగుతాయ్.. తెలుగుతో పాటే మరో భాషలోనూ చిత్రం విడుదలయితే నాకు బోనస్.. అందుకే ఇలా చేస్తున్నా అని అన్నారు.