twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లుడు శ్రీను' ఇన్ సైడ్ టాక్ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల్లుడు శ్రీను'. సమంత హీరోయిన్. బెల్లంకొండ సురేష్‌ సమర్పకుడు. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్‌‌స పతాకంపై బెల్లంకొండ గణేష్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 25న విడుదల కు సిద్దమవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఇన్ సైడ్, ఇండస్ట్రీ టాక్ ఏంటి అనేది చూద్దాం.

    సెంటిమెంట్, వినోదం, హాస్యంతో కొత్తకోణంలో రూపొందిన చిత్రం'అల్లుడు శ్రీను' అని మీడియాలో విపరీతంగా ఈ చిత్రం గురించి ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ఇరగతీసాడని, బ్రహ్మీ కామెడీ కోసమే రిపీట్ ఆడియన్స్ వస్తారని అంటున్నారు. నిజమేనా..ఇండస్ట్రీ జనం ఏమంటున్నారు.

    మరో ప్రక్క కొత్త కుర్రాడైనా స్టెప్స్ విరగతీసాడని ప్రోమోలు చూసిన జనం అంటున్నారు. బెల్లంకొండ సురేష్ సైతం తన కుమారుడు లాంచింగ్ చిత్రం కావటంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని విడుదల చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్ ఏక్టివిటేసే కనపడుతున్నాయి. సెన్సార్ యాక్టివిటీస్ నిన్నటితో పూర్తి అయ్యాయి. ఎ సర్టిఫికేట్ ఈ చిత్రానికి ఇచ్చారు.

    సెన్సార్ టాక్, ఇన్ సైడ్ టాక్ ఏంటన్నది స్లైడ్ షోలో చూద్దాం

    కన్ఫూజ్ చేసి

    కన్ఫూజ్ చేసి

    ఈ చిత్రంలో సెకండాఫ్ కీలకంగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా బ్రహ్మానందం సెకండాఫ్ లో రావటం, బ్రహ్మీపై పంచ్ లు థియోటర్ ని దద్దరిల్లేలా చేస్తాయంటున్నారు. ఈ సినిమాకు బ్రహ్మీ కామెడీనే పూర్తిగా నమ్ముకున్నాడంటున్నారు. హీరో, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేసాలు నవ్విస్తాయంటున్నారు. అల్లుడు శ్రీను అంటూ తన పేరు చెప్పి కన్ఫూజ్ చేసి కామెడీ పుట్టిస్తారని చెప్తున్నారు.

    ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్

    ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్

    ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ డ్యూయిల్ రోల్ లో కనపడతాడు. మొదటి పాత్ర డాన్ (మెయిన్ విలన్) అని తెలుస్తోంది. అలాగే మరో పాత్ర నార్మల్ పాత్ర. ఈ రెండు పాత్రలతోనే కథలో ట్విస్ట్ లు,కామెడీ ఉండనుంది.

    సమంత

    సమంత

    ఈ చిత్రంలో సమంత ...మొదటనుంచి మనకు డాన్...ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపిస్తుంది. అయితే చివరికి వచ్చేసరికి ఆమె సాధారణ ప్రకాష్ రాజ్ కూతురు అని రివిల్ అవుతుంది.

    బ్రహ్మానందం పాత్ర

    బ్రహ్మానందం పాత్ర

    ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పేరు డింపుల్. ఈ పాత్ర...డాన్ ప్రకాష్ రాజ్ కు పిఎ గా ఉంటాడు. సెకండాఫ్ ప్రారంభమైన పది నిముషాల నుంచి ప్రారంభమైన బ్రహ్మీ కామెడీ..చివరి వరకూ నడుస్తుంది.

    డాన్స్ లు

    డాన్స్ లు

    సినిమాలో పాటలు ఇప్పటికే హిట్ అవటం బాగా కలిసి వచ్చే అంశం. ఈ పాటలకు బెల్లంకొండ శ్రీనువాస్ స్టెప్స్ కూడా బాగా వేసాడని అంటున్నారు. ప్రోమోలతో కూడా ఈ విషయం మనకు అర్దమవుతోంది

    హీరో క్యారక్టరైజేషన్

    హీరో క్యారక్టరైజేషన్

    ఈ చిత్రంలో హీరోకు ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ ని వినాయిక్ ఇచ్చారు. ఏదైనా తేలిగ్గా తీసుకుని స్పీడుగా దూసుకుపోయి చేసే కుర్రాడు కథ ఇది. జీవితంలో ఎదగాలంటే రిస్క్‌ చేయాల్సిందే అనేది ఆ కుర్రాడు నమ్మిన సిద్ధాంతం. మరి అతను ఎదిగేందుకు ఎలాంటి సాహసాలు చేశాడో అనేదే సినిమా కథ.

    కథేంటి

    కథేంటి

    హీరో అనాథ. అతన్ని ప్రకాశ్‌రాజ్‌ ‘అల్లుడు.. అల్లుడు' అని పిలుస్తుంటే, హీరో ఆయన్ని ‘మావా.. మావా' అని పిలుస్తుంటాడు. ఒకానొక సమయంలో ప్రకాష్‌రాజ్‌ చేయని తప్పుకు నిందలపాలవుతాడు. దీన్ని నుంచి అల్లుడుశీను మామ ప్రకాష్‌రాజ్‌ను ఎలా బయటపడేశాడనేది కథ. దానికి సమాంతరంగా ప్రేమకథ నడుస్తుంది. ప్రకాశ్‌రాజ్‌ కేరక్టర్‌లో ట్విస్ట్‌ ఉంటుంది.

    అదే ఇది

    అదే ఇది

    బ్రహ్మానందంను ఓసారి బురిడీ కొట్టించడానికి తన పేరు ‘అల్లుడు శీను' అని చెబుతాడు హీరో. బ్రహ్మానందం కూడా అతని పేరు నిజంగా అదేనని నమ్ముతాడు. అదొక ట్రాక్‌గా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. సెకండాఫ్‌లో 45 నిమిషాల సేపు నాన్‌స్టాప్‌గా నవ్వుతాం అని చెప్తున్నారు.

    తెర ముందు

    తెర ముందు

    ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక


    ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

    English summary
    
 Inside talk of ‘Alludu Seenu’ film is good where the first half is okay without Brahmanandam’s comedy and the second is too good with too many Brami’s punches.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X