twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో చారిత్రిక పాత్రలో అనుష్క...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి గా చారిత్రిక పాత్ర చేస్తున్న అనుష్క మరో చారిత్రిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనుందా అంటే...అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. త్వరలో ఆమె భాగమతి అనే టైటిల్ తో ముందుకు రానుందని,ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని వినికిడి. మిర్చి నిర్మాతలు వినోద్-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్తున్నారు.

    అలాగే ఈ భారీ చిత్రాన్ని పిల్ల జమీందార్ తో పరిచయమైన అశోక్ దర్శకత్వం వహించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. నిర్మాతలు మాత్రం ఆమెకు భారీగా రెమ్యునేషన్ ఇచ్చైనా ప్రాజెక్టు మొదలెడదామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అన్నీ సెట్ అయితే 2014 మే నెలలో మొదలయ్యే అవకాసం ఉంది. పిల్ల జమీందార్ తర్వాత అశోక్ చేసిన సుకుమారుడు భారీ ఫ్లాఫ్ అయ్యింది. ఈ చిత్రం మొదలైతే అతని కెరీర్ మళ్లీ గాడిలో పడినట్లే.

    భాగమతి విషయానికి వస్తే... ఇదో ప్రేమ కథ. యవ్వనపు తొలి ప్రాయం లోనే ప్రేమలో పడ్డ యువరాజు కులీ కుతుబ్‌షా తన ప్రేయసి భాగమతిని కలవడానికి ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న ముచికుందా నదిని దాటుతుంటే పుత్ర ప్రేమతో తండ్రి కట్టించిన వంతెనే పురానాపూల్. ఇది ప్రేమకు గుర్తు. ఆ తర్వాత బాద్‌షా తన ప్రేయసి భాగమతి కోసం నిర్మించిన ప్రేమ నగరమే హైదరాబాద్ నగరం. నవాబు ఇస్లాం మతానికి చెందినవాడు. ఆయన ప్రేయసి హిందూ స్త్రీ.

    అట్లా హైదరాబాద్ నగరం ప్రేమ పునాదిగా, రెండు మతాల మధ్య సమైక్యతకు, సహజీవనానికి వారధిగా నిలిచింది. కుతుబ్‌షా ప్రేయసి భాగమతి అర్థాంగిగా, హైదర్‌బేగంగా మారంగనే బాగ్యనగరం హైదరాబాద్‌గా పేరు మార్చుకున్నది. సుమారు ఐదేళ్ల పాటు వీరి ప్రేమ కొనసాగింది. ఆ తరువాత భాగమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి హైదర్‌మహల్‌గా పేరు మార్చుకోవడంతో వీరి ప్రేమ కథ సుఖాంతమైంది. భాగ్యనగర్ కాస్తా హైదరాబాద్‌గా మారింది.

    English summary
    Anushka is all set to enact the role of Bhagmati. This film is said to be a love story, which will be directed by Ashok, who was popular for his film Pilla Jamindar. Vamsi-Pramod will be producing this venture. Last year this duo produced the film Mirchi with Prabhas and Anushka in the lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X