twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ డైరక్టర్ తో...బాలకృష్ణ నెక్ట్స్

    By Srikanya
    |

    Balakrishna
    హైదరాబాద్ : వరస ప్లాపులను ఎదుర్కొన్న బాలకృష్ణ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకటికి పదిసార్లు స్క్రిప్టుని,దర్శకుడి ట్యాలెంట్ ని చెక్ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం లెజండ్ చిత్రం చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి ఓ స్టార్ తమిళ దర్శకుడుతో చేయబోతున్నారని వినికిడి. ఆయన మరెవరో కాదు కె.ఎస్ రవికుమార్. కె.ఎస్ రవికుమార్ తమిళంలో స్టార్ డైరక్టర్ గా ఒకప్పుడు వెలిగొందినవాడు. రజనీ,కమల్ వంటి స్టార్స్ తో నరసింహ,విశ్వరూపం వంటి సూపర్ హిట్స్ కొట్టినవాడు.

    దాంతో రవికుమార్ దర్శకత్వంలో చేయటానికి బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ని తెరపై విజిల్స్ వేయించేలా తీయటంలో ఆయనకి ఆయనే సాటి. ఇక రీసెంట్ గా బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పటం జరిగిందని తెలుస్తోంది. బాలకృష్ణ పూర్తి స్క్రిప్టు విని,డేట్స్ కేటాయిస్తానని చెప్పాడని అంటున్నారు. నిర్మాత ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. బెల్లంకొండ సురేష్ అయ్యే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే గతంలో రవికుమార్ తెలుగులో ఓ చిత్రం చేసారు. అదే నాగార్జునతో బావ నచ్చాడు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

    ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సొనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్.

    'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్‌ లెజెండ్‌ ఫస్ట్‌లుక్‌ను రీసెంట్ గా విడుదల చేసింది. దానికి మంచి క్రేజ్ వచ్చింది.

    English summary
    Natasimha Balakrishna who is currently starring in ‘Legend’ under the direction of Boyapati Srinu entertained on New Year with his first look. Now sources say, he is getting ready to star under popular kollywood director KS.Ravikumar. Buzz is story discussions took place between both of them and Balakrishna gave green signal to the director. Currently script work is under way with Parachuri brothers helping in the script.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X