twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లెజెండ్‌' : ఎలక్షన్ కమిషన్ ఏం సెన్సార్ చేసింది?

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం "లెజెండ్'' . ఎలక్షన్ కమీషన్ ఈ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రాన్ని చూసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని "గన్ తో బెదిరిస్తే ,బెదిరిపోవడానికి వోటర్ ని కాదు బే, షూటర్ ని ." అనే డైలాగుని తొలిగించమని చిత్ర నిర్మాతలను ఆదేశించినట్లు అంతర్గత సమాచారం. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఏ న్యూస్ రాలేదు.

    ఈ చిత్రం షోలు ఆపేయండని అనంతపురం కలెక్టరకు,ఎలక్షన్ కమిషన్ కు వైఎస్ ఆర్ సీపీ పార్టీ నాయకులు వినతి పత్రం అందచేసారు. ఈ చిత్రంలో సన్నివేశాలు, డైలాగులు తెలుగు దేశం పార్టీ ప్రచారానికి దోహదం చేసే విధంగా ఉన్నాయని ఆరోపణ చేసారు. అందుకే లెజండ్ చిత్రాన్ని ఎలక్షన్ కమీషన్ చూడటం జరిగింది. ఆ సినిమా హీరో బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించిన నేపధ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే లెజండ్ సినిమా టీడీపి కి అనుకూలంగా ఉందని, అందులో డైలాగులు ఆ పార్టికి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణాలో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.

    EC censors Legend dialogues

    నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యాభై కోట్లు వచ్చాయని, ఈరేర్ ఫీట్ తాజా చిత్రం "లెజెండ్'' ద్వారా సాధించారని స్వయంగా ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

    ఆ ప్రకటనలో ... బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది.

    నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం. త్వరలోనే లెజెండ్ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొని ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లెజెండ్ విజయానందంలో ఉన్న నందమూరి అభిమానులకు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం నూతనోత్సహాన్నిచ్చింది అన్నారు.

    English summary
    
 
 Election Commission which watched Natasimha Balakrishna's Legend yesterday at Prasad Labs, Hyderabad acting on the complaint received by YSRCP, decided to censor Balakrishna's dialogue in the film. The dialogue which was censored by Election Commision is “Gun tho bedhiristhe, bedhiripovadaniki voter ni kaadu bey, shooter ni.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X