twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా, మహేష్‌ కూడా ఫ్యాక్షనిజమా?

    By Srikanya
    |

    Is Mahesh reviving Factionism?
    హైదరాబాద్: మహేష్‌బాబుని 'దూకుడు' సినిమాలో కొత్తగా చూపించారు దర్శకుడు శ్రీనువైట్ల. 'ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే... అసలు, సిసలు... మాస్‌ మహేష్‌ని ఇప్పుడు 'ఆగడు'లో చూపిస్తా'నంటున్నారు శ్రీనువైట్ల. అయితే ఆ కొత్తగా చూపించేది ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో అని విశ్వసనీయ సమాచారం. మహేష్ ని ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

    ఫ్యాక్షనిజం అనేది తెలుగు భాక్సాఫీస్ లో బాగా సక్సెస్ అయిన ఫార్ములా. దాదాపు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పెద్ద చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు 'ఆగడు' కథ కూడా రాయలసీమ లోని ఆనంతపూర్ జిల్లా తాడిపత్రి గ్రామం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అంటున్నారు. ఇందునిమిత్తం అనంతపురం తాడిపత్రి సెట్ ని గుజరాత్ లో వేసి షూట్ చేస్తున్నారు. తాడిపత్రిలో షూట్ చేస్తే క్రౌడ్ ని కంట్రోల్ చేయటం కష్టమని అక్కడ శ్రీను వైట్ల ఇలా ప్లాన్ చేసాడంటున్నారు. జనవరి 18 నుంచి భారీ షెడ్యూల్ ఇక్కడ జరగనుంది.

    శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. మహేష్‌బాబు హీరో. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు నుంచి అతని అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. మహేష్‌ పాత్రని దర్శకుడు వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ''అన్నారు. సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    'Aagadu' is having a Rayalseema backdrop and the film is set in Tadipatri of Anantapur district. Shooting with Mahesh Babu at an outdoor location in Tadipatri is impossible due to the uncontrollable crowds, Srinu Vytla choose to go to Gujarat where a big schedule will be shot from January 18th. A massive Tadipatri village set has been constructed in Gujarat for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X