twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కి సైతం జగపతిబాబే

    By Srikanya
    |

    హైదరాబాద్: జగపతిబాబు నటించిన లెజండ్ చిత్రం విజయవంతమవటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయన మీద ఉంది. ఆయన తమ సినిమాలో నటిస్తే హిట్ గ్యారెంటీ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ని 'గోవిందుడు అందరివాడేలే' లోనూ జగపతిబాబుని విలన్ గా తీసుకున్నారని సమాచారం. జగపతిబాబు ఈ చిత్రంలో విలేజ్ విలన్ గా కనిపిస్తారని తెలుస్తోంది. విలేజ్ హీరోగా చేసిన జగపతి ఇప్పుడు విలేజ్ విలన్ అంటే వెరైటీగా ఉంటుందని చెప్తున్నారు. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

    కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా ప్రకాష్ రాజ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు. కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు

    Jagapathi babu in "Govindudu Andarivadele"

    రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి నేపథ్యమున్న యువకుడిగా కనిపించబోతున్నాడు. హైదరాబాద్‌లో రూపొందించిన సెట్‌లో కుటుంబ నేపథ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.
    మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి.

    ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ, జయసుధ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    
 
 Jagapathi Babu is also signed to play one crucial village based villain role in "Govindudu Andarivadele."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X