twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ సెటైర్స్ ఎవరికి?

    By Srikanya
    |

    హైదరాబాద్: రీసెంట్ గా ఆగడు టీజర్ తో మహేష్ బాబు కొన్ని వ్యంగ్య బాణాలు ఎక్కుపెట్టి అందరి నోట్లో నానారు. ఇప్పుడు ఎన్టీఆర్ తనదైన శైలిలో సెటైర్స్ తో రాబోతున్నట్లు సమాచారం. తన తాజా చిత్రం రభసలో ఎన్టీఆర్ చెప్పై డైలాగ్స్ లో సెటైర్స్ మిళితం చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఎవరిపై, ఏ విధంగా తన బాణాలు ఎక్కుబెట్టబోతున్నాడో తెలియలేదు. ఫస్టాఫ్ లో ప్రేమ కధా చిత్రం ఫేమ్ సప్తగిరితో, సెకండాఫ్ బ్రహ్మానందం తో కలిసి చేసే కామెడీ హైలెట్ గా ఉంటుంది, ఈ నేపధ్యంలో టపాటపా అంటూ స్పీడుగా ఎన్టీఆర్ వేసే సెటైర్స్ ఆకట్టుకుంటాయని అని ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది. ఆ తరహా డైలాగులతో ఓ టీజర్ కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ సైటెర్స్ , అవి ఏ రేంజిలో ఉన్నాయి తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'రభస' లో ఆయన నటిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకిరానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడారు అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ..ఇంట్రడక్షన్ సాంగ్ కు కొరియోగ్రఫీ కూడా చేసారని విశ్వసనీయ సమాచారం. ఫస్ట్ లుక్ తో ఆకట్టులేకపోవటంతో ఈ ఇంట్రడక్షన్ సాంగ్ నే టీజర్ గా కట్ చేసి వదులుదామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

    jr NTR satires in rabhasa

    దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ... ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. ఎన్టీఆర్‌, సమంతలపై స్విట్జర్లాండ్‌ ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 27న పాటల్ని విడుదల చేసి, ఆగస్ట్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 20 మందితో కన్నా ఎన్టీఆర్‌తోనే కంఫర్ట్‌గా ఉంది.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    In Rabhasa NTR’s character will have different shades and his satires on characters around him are sure to bring laughs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X