twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సరసన నితిన్ హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్,పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఫైనల్ అయ్యిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆమె మరెవరో కాదు...పూరీ తాజా చిత్రం హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన కనిపించిన అదా శర్మ అని తెలుస్తోంది. మహేష్ సైతం ఆమెను తన సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రీసెంట్ గా హార్ట్ ఎటాక్ చిత్రం చూసిన మహేష్ ఆమెతో చేయటానికి ఆసక్తి చూపించాడని,ఆమె ఫెరఫార్మెన్స్ ని మెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన ఆమె బాలీవుడ్ చిత్రం హసీతో హై పసీ సైతం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది.

    ఆదా శర్మ మాట్లాడుతూ...హార్ట్ ఎటాక్ సినిమా నాకు తెలుగులో మొదటిది. అయితే దర్శకుడు పూరీ తో ఇంట్రడ్యూజ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో సినిమా చేస్తే కెరిర్ బాగుంటుందని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. అయితే ఈ సినిమా ద్వారా నేను ది బెస్ట్ యాక్షన్ ఇచ్చాను. దీనిలో నా క్యారెక్టర్ ఆసక్తిగా ఉంటుంది. కానీ దీనిలో తెలుగు డబ్బింగ్ లు చెప్పడానికి నేను రెండు నెలల ముందే స్ర్కిప్టును ప్రిపేర్ అయ్యాను అంది.

    అలాగే పూరీ జగన్నాథ్ షూటింగ్ లో చాలా మ్యాడ్ ఫెలో గా ఉన్నాడు. ఆయన హీరోను చూపించే విధానం కూడా అలాగే ఉంటుంది. ఓ పోకిరీలాగా హీరోల క్యారెక్టర్లు ఉంటాయి. అయితే అలాంటి వారికే క్రేజ్ ఎక్కువ. ఇక నితిన్ చాలా మంచి వ్యక్తి. తను ఓ సూపర్ స్టార్. ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉంది. అతని సినిమాలు బాగా చూసాను. జయం, ఇష్క్, గుండెజారీ గల్లంతయ్యిందే చిత్రాలను చూశాను. చాలా బాగున్నాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి హిట్ అయ్యిందని సంతోషంగా ఉంది అంది.

    English summary
    Heart Attack babe Adah Sharma has been offered to act opposite Mahesh Babu in his next film, which will be directed by Puri Jagannath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X