twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదలెట్టారు: మహేష్ 'ఆగడు' కాపీ గోల

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెద్ద హీరోల సినిమాలపై అందరి దృష్టీ ఉంటుంది. అందులో ప్రతీ అంశం నిశిత దృష్టితో పరిశీలిస్తూంటారు. దాంతో ఎక్కడన్నా మిగతా సినిమాలతో పోలిక కనిపిస్తే...కాపీ టాప్ బయిలు దేరిపోతుంది. తాజాగా మహేశ్‌ హీరోగా నటిస్తున్న 'ఆగడు' రెండో టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్...మళయాళ చిత్రం 'అవతారం 'టీజర్ నుంచి లిప్ట్ చేసారని అంటున్నారు. రెండూ ఒకేలాగ ఉన్నాయని ఆరోపణలు ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్కడ చూసినా కనపడుతున్నాయి.

    తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు. కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్‌ తరహాలోనే ఈ రెండో టీజర్‌లో హైవోల్టేజి యాక్షన్‌ సీన్లు, పంచ్‌ డైలాగులు ఉన్నాయి.

    Mahesh's “Aagadu” Copycat?

    మహేశ్‌ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', 'అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్‌తో 'ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక 'ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Controversy, the latest one, which is on the cyber space, is that of the Back ground music, which is used in the teaser and was released on the eve of “Mahesh Babu’s birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X